
కోటనందూరు: పి.కొట్టం గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. స్వామివారి వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆలయ ధర్మకర్త బొంగు గోపాలకృష్ణ సోమవారం ఉదయం తెలిపారు. కిరీటం, శంకు చక్రాలు, మోదుకాస్తము, వెండి పాదములు తదితర విలువైన సుమారు మూడు నుంచి నాలుగు కేజీల వెండి వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. వీటితో పాటు సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ బాక్స్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై గోపాలకృష్ణ కోటనందూరు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





