
India vs Afghanistan: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ (Sanju Samson) ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు (Afghanistan Cricket Team) తో జరిగిన రెండో టీ20లో 22 బంతుల్లోనే 57 పరుగులతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 17 గురువారం నాడు జరగబోయే మూడో టీ20 ముందు ఆయన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. భారత జట్టును నడపడం అంత తేలికైన విషయం కాదని, 15 ఏళ్ల కుర్రాడు 700-800 పరుగులు సాధిస్తూ దూసుకొస్తుంటే పోటీ తప్పదని ఆయన పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) ముందు టీ20 ప్రపంచకప్ (T20 world cup) సమయంలో తాను రాణించినప్పటికీ, ఆ తర్వాత రెండు మూడు మ్యాచ్లలో సరిగ్గా ఆడకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనలు మారడం సహజమేనని చెప్పాడు. లీగ్లో సారథిగా ఉంటూ తాను కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నానని, నాయకత్వ బృందం పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని సంజు స్పష్టం చేశాడు.





