
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి హంస వాహనంపై వీణాపాణిగా మలయప్పస్వామి తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన బుధవారం రాత్రి శ్రీమలయప్పస్వామి హంస వాహనంపై వీణాపాణియైన సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఉదయం ఐదుతలల చిన్నశేషు వాహనంపై మలయప్ప శ్రీపాండురంగనాథ స్వామి అలంకారంలో తిరుమాడ వీధుల్లో విహరించారు. మధ్యాహ్నం శ్రీరంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. వాహన సేవల సందర్భంగా భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి.గురువారం ఉదయం సింహవాహన సేవ, రాత్రికి ముత్యపు పందిరి వాహన సేవలు జరగనున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




