
మునిగి మృతిచెందారు. మృతులు నర్సింహరాజు (21) ఏపీ, ఎల్లంకి, బీటెక్ సెకండ్ ఇయర్, సుమంత్‌రెడ్డి (17) డిప్లొమా సెకండ్ ఇయర్, భద్రాచలం, గణేశ్ (18) డిప్లొమా సెకండియర్, వరంగల్, ఉదయ్ కిరణ్ (22) డిప్లొమా థర్డ్ ఇయర్, సంగారెడ్డి, తేజ (శ్యామ్‌కుమార్ (17) డిప్లొమా ఫస్ట్ ఇయర్, కూకట్పల్లి, సిద్ధార్థ్ (17) టెన్త్ క్లాస్, వరంగల్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను పోలీసులు ప్రాచీన గ్లోబల్ దవాఖానకు తరలించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, రామచంద్రాపురం మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్ దవాఖానకు చేరుకున్నారు. మృతదేహాలకు పోస్టమార్టం పూర్తిచేసి, గురువారం ఉదయంలోగా స్వస్థలాలకు తరలించాలని ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్ అజయ్‌కుమార్‌రెడ్డిని ఎమ్మె ల్యే ఆదేశించారు. ఏపీకి చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తి తన కుమార్తె శిరీష పేరు మీద 25 ఏండ్లుగా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు.