
– మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత బూర్గంపహాడ్, సెప్టెంబర్ 16 : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించ తలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమానికి బూర్గంపహాడ్ మండలం నుండి పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత బుధవారం పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిధిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మునిసిపల్ చైర్మన్లు, బీఆర్ఎస్ కార్పోరేటర్లు, ఆయా విభాగాల అనుబంధ సంఘాల నేతలు, నాయకులు, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.





