
Sanju Samson : సంజూ శాంసన్‌కు ఘోర అవమానం! కూరలో కరివేపాకులా తీసేశారా?
టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు (Sanju Samson) ఘోర అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుతోంది
© 2026 nimisham.in

టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు (Sanju Samson) ఘోర అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుతోంది

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్.. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్‌కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్‌పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్‌కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్‌తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సంజూ శామ్సన్ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంజూ పట్ల జట్టు యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని, ఆయనను జట్టు నుంచి తొలగించారని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే ఆ సమయంలోనే బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ ఆయనను జట్టు నుంచి తప్పించలేదని, బిజీ షెడ్యూల్ కారణంగా పనిభారాన్ని తగ్గించేందుకే విశ్రాంతినిచ్చామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఆయనను నేరుగా ఎంపిక చేయడంతో బోర్డు చెప్పిన మాట నిజమేనని రుజువైంది. జింబాబ్వే పర్యటన నుంచి శామ్సన్‌కు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన పాత యూకే టూర్ ప్రదర్శన కూడా ఒక కారణంగా నిలిచింది. ఐర్లాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆయన కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. అందులో ఒక ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ పర్యటనలోని 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆయనకు కేవలం 2 మ్యాచ్‌లలోనే అవకాశం లభించగా, మొదటి మ్యాచ్‌లో 1 పరుగు, చివరి మ్యాచ్‌లో 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన మ్యాచ్‌లలో ఆయన స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకున్నారు. నిరాశపరిచిన యూకే పర్యటన తర్వాత లభించిన చిన్నపాటి విరామం సంజూ శామ్సన్‌కు మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ విరామం తర్వాత ఇప్పుడు

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్‌తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్‌తోనే పాండ్య.. కానీ, కెప్టెన్‌గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్‌ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

IND vs ENG 1st T20 : డర్హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, భారత వీరులు ఇంగ్లాండ్ బౌలింగ్‌ను బ్రేక్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 189 పరుగుల భారీ స్కోరు సాధించి ప్రత్యర్థి ముందు 190 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఇంగ్లాండ్ తన ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. ఎంతసేపటికీ వాన తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఊహించని విధంగా ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈసారి కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 1 రన్ చేసి సాకిబ్ మహమూద్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే అదే ఓవర్లో మరో స్టార్ బ్యాటర్ ఈషాన్ కిషన్ దురదృష్టవశాత్తూ ఖాతా తెరవకుండానే రన్ అవుట్ రూపంలో వెనుతిరిగాడు. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి జట్టు తీవ్ర ఒత్తిడిలో పడిన సమయంలో, ఓపెనర్ అభిషేక్ శర్మ తన వినాశకర బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అభిషేక్ శర్మ మైదానంలో సిక్సర్ల సునామీ సృష్టించి కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఆయన అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా, అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించుకున్నాడు. అభిషేక్ శర్మ మొత్తం 24 బంతులు ఎదుర్కొని 245 స్ట్రైక్

చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. వర్షం కారణంగా కేవలం సగం మ్యాచ్ మాత్రమే జరిగింది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లు పూర్తిగా బ్యాటింగ్ చేసింది, కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కు రాకుండానే మ్యాచ్ వర్షం అంతరాయం కారణంగా ఫలితం తేలకుండా ముగిసిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాలో అదరగొట్టింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది కూడా చదవండి: హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి? అయితే ఈ మ్యాచ్‌లో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ ఫీల్డర్ టామ్ బాంటన్ సూపర్మ్యాన్లా మారి ఓ నమ్మశక్యం కానీ క్యాచ్‌ను పట్టుకున్నాడు. అది కూడా ఎవరిదో కాదు టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌ది. అసలే గత రెండు మ్యాచ్‌లుగా ఫామ్ కోల్పోయి కష్టాల్లో ఉన్న సంజూ శాంసన్ ఇలాంటి అద్భుతమైన క్యాచ్‌కు అవుటై మరింత నిరాశకు గురైయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 సిరీస్‌లో విఫలమైన సంజూ శాంసన్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించాలనే ఒత్తిడి ఉంది. ఎందుకంటే బెంచ్‌లో వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ కూర్చోని ఉన్నాడు. ఇది కూడా చదవండి: వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్.. ఏమన్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే How about this catch from Tom Banton to dismiss Sanju Samson 😱 అతన్ని ఎప్పుడెప్పుడు ఆడిస్తారా అంటూ యావత్ క్రికెట్ లోకం ఎదురుచూస్తోంది. ఇలాంటి టైమ్ సంజూకు అదృష్టం కూడా కలిసి రావడం లేదు. నిజానికి అది అంత సులువైన క్యాచ్ కాదు, బౌండరీ వెళ్లాల్సిన బాల్. కానీ బాంటన్ ఎంతో అద్భుతంగా గాల్లోకి పక్షిలా ఎగురుతూ ఆ క్యాచ్ పూర్తి చేశాడు. దీంతో సంజూ ఇన్నింగ్స్ కేవలం ఒక్క పరుగు వద్దే

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ మొదలైపోయింది. తొలి మ్యాచ్ బుధవారం రాత్రి 10 గంటలకు మొదలైంది. చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్ జరిగేది ఇంగ్లాండ్‌లో కానుక మన కాలమాన ప్రకారం మ్యాచ్ మధ్యరాత్రి జరగడంతో చాలా మంది భారత క్రికెట్ అభిమానులు చూడలేకపోయారు. కొంతమంది టీమిండియా బ్యాటింగ్ చూసినా ఎక్కువ మంది నిద్రలోకి జారుకున్నారు. అయితే అందరూ పడుకున్నాక టీమిండియా అదరగొట్టిందనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరోసారి ఓపెనర్ సంజూ శాంసన్ ఒక్క పరుగు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. ఇక టీ20ల్లో వరల్డ్ నంబర్ స్థానానికి చేరుకున్న ఇషాన్ కిషన్ సైతం విఫలం అయ్యాడు. కానీ, ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం షేకాడించాడు. కేవలం 24 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులుచేసి అదరగొట్టాడు. అతనికి సర్పంచ్సాబ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం జతకలిశాడు. ఇది కూడా చదవండి: హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి? టీ20 కెప్టెన్సీ దక్కాక పెద్దగా రాణించని అయ్యర్.. ఆ కసిమొత్తం ఈ మ్యాచ్‌లో చూపించాడు. 47 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 68 పరుగులు చేసి టీ20 కెప్టెన్‌గా తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయ్యర్ ఇన్సింగ్స్ కాస్త స్లో అనిపించినా.. టీమిండియా కేవలం 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడటంతో అయ్యర్ అలా ఆడాల్సి వచ్చింది. ఇక చివర్లో శివమ్ దూబే శివాలెత్తాడు. కేవలం 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి మంచి ఎండింగ్ అందించాడు. ఇది కూడా చదవండి: వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్

Sanju Samson : భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఫామ్ ఇప్పుడు టీమిండియా మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, టీమిండియా మేనేజ్మెంట్ గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఈ కుర్రాడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. యువ ఆటగాళ్లను ఆడించడంలో తొందరపడకూడదని జట్టు భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం ఇవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కారణం సంజూ శాంసన్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలం కావడమే. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో కేవలం 1 రన్ మాత్రమే చేసి సంజూ పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఐర్లాండ్ టూర్లోనే సంజూ శాంసన్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఆ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో 5 పరుగులు మాత్రమే చేసిన సంజూ, రెండో మ్యాచ్‌లో కనీసం ఖాతా తెరవకుండానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొదటి మ్యాచ్‌లో రెండో ఓవర్ తొలి బంతికే అవుట్ కాగా, రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ పారేసుకున్నాడు. ఈ ఫ్లాప్ షో ఇంగ్లాండ్ గడ్డపై కూడా కొనసాగింది. చేస్టర్-లే-స్ట్రీట్‌లో జరిగిన మొదటి టీ20లో కూడా రెండో ఓవర్లోనే కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. కేవలం కొన్ని నెలల క్రితమే టీ20 వరల్డ్ కప్‌లో 300 కంటే ఎక్కువ రన్స్ చేసి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలిచి, భారత్‌ను వరల్డ్ ఛాంపియన్‌గా నిలబెట్టిన సంజూ.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రాగానే ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్స్ నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వరల్డ్ కప్, ఐపీఎల్ సీజన్లలో సంజూ శాంసన్ అదిరిపోయే ఫామ్‌లో ఉన్న మాట నిజమే కానీ, ఆ మ్యాచ్‌లన్నీ భారత

IND vs ENG Today Match: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన చేదు అనుభవాలను పక్కనబెట్టి, టీం ఇండియా మరో మహా సమరానికి సిద్ధమైంది. నేటి నుంచే ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల ఉత్కంఠభరిత టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత యువ జట్టు ఎలా పుంజుకుంటుంది, సిరీస్ బోణీ కొట్టడానికి గౌతమ్ గంభీర్ ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాడనేది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐర్లాండ్ పరాభవం నుంచి ఇంగ్లాండ్ సవాల్ వైపు.. ఐర్లాండ్‌తో జరిగిన గత సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా సీనియర్ల గైర్హాజరీలో బాధ్యత తీసుకుంటారనుకున్న సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్‌గా తొలి సిరీస్ అందుకున్న శ్రేయస్ అయ్యర్ అటు సారథిగా, ఇటు బ్యాటర్‌గా ఒత్తిడికి లోనై తడబడ్డాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ పర్యటన అతడి కెరీర్‌కు అత్యంత కీలకమైన పరీక్షగా మారింది. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక మ్యాచ్‌లో మెరిసినా, తర్వాతి మ్యాచ్‌లో చేతులెత్తేసాడు. యువ బ్యాటర్ తిలక్ వర్మ అర్ధ సెంచరీ చేసినప్పటికీ, అతడి నెమ్మదైన ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. ఈ బ్యాటింగ్ వైఫల్యాలన్నింటినీ అధిగమించి, బలమైన ఇంగ్లాండ్ జట్టును వారి సొంత గడ్డపై ఢీకొట్టడం ఇప్పుడు యువ భారత్‌కు సవాల్‌గా మారింది. ఇది కూడా చదవండి: IND vs ENG 1st T20I: బుడ్డోడిని తొలి బంతికే ఇంటికి పంపిస్తా.. తొడగొట్టి మరీ సవాల్ చేసిన వైభవ్ దోస్త్..! ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత జట్టుకు కొండంత అండగా మారేందుకు ఒక యువ కెరటం సిద్ధంగా ఉంది. అతడే యువ పేసర్ ప్రిన్స్ యాదవ్. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్, తొలి మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లు తీసి అందరి దృష్టిని

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. India Vs England T20I Series: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్‌లో భారత జట్టు ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అందులో భారత బ్యాటర్ల వైఫల్యం పెద్ద కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ జట్టులో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నేటి నుంచి అనగా జూలై 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ (5 మ్యాచ్‌లు)లో భారత కోచ్ సరికొత్త ప్లాన్‌తో రాబోతున్నారని తెలుస్తోంది. ఓటమి తర్వాత ఒత్తిడిలో టీమిండియా.. భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత జులై 14 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ పర్యటనకు ముందు ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సులువుగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్ల నిర్లక్ష్యం కారణంగా సిరీస్ కోల్పోవడంతో పాటు భారత ఓపెనర్లు పేలవ ప్రదర్శనతో రాణించలేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. దీంతో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో బలమైన ఓపెనర్లను ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది. ఐలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఓపెనింగ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజు సాంసంగ్ ఆశించిన స్థాయిలో

IND vs ENG : భారత క్రికెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ పర్యటనలో ఈ వండర్‌కిడ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తాడని ఫ్యాన్స్, బ్రాడ్‌కాస్టర్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అతడిని తుది జట్టులోకి తీసుకోకుండా బెంచ్‌కే పరిమితం చేసింది. ఐర్లాండ్ వంటి చిన్న జట్టుపై మ్యాచ్ అయితే ఈ కుర్రాడికి ఒత్తిడి తక్కువగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆ సిరీస్‌లో భారత్ 0-2తో ఓడిపోవడమే కాకుండా వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, వైభవ్ తన అరంగేట్రం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని అనడం మరింత దుమారం రేపింది. వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోకపోవడంపై బీహార్‌లోని బేగుసరాయ్ ఎంపీ, కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా స్పందించారు. బీహార్‌లోని సమస్తీపూర్‌కు చెందిన ఈ 15 ఏళ్ల స్టార్ ప్లేయర్‌ను పక్కన పెట్టడంపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను ఆయన తప్పుబట్టారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, బ్రయాన్ లారా వంటి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలే వైభవ్ టాలెంట్‌ను మెచ్చుకుంటూ, అతని చుట్టూ టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను నిర్మించవచ్చని అన్నారని గుర్తు చేశారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు ఉన్న వైభవ్ ప్రపంచ క్రికెట్ భవిష్యత్తు అని, అలాంటి ఆటగాడిని ఎందుకు ఆడించట్లేదని మంత్రి ప్రశ్నించారు. ఇంగ్లాండ్‌తో జూలై 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ మొదటి మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఈ రాజకీయ ఒత్తిడిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ రాజకీయ నాయకుల నుంచి వస్తున్న డిమాండ్లపై మీడియా ప్రశ్నించగా శ్రేయస్ అయ్యర్ చాలా కూల్‌గా

India tour of England 2026: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు జట్టు యాజమాన్యం కీలక మార్పులు చేయాలని భావిస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనింగ్ జోడీని మార్చి, సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగడానికి టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఐర్లాండ్ కొట్టిన దెబ్బ.. అభిమానుల్లో మొదలైన టెన్షన్..! భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన రేపటి నుంచే ప్రారంభం కానుంది. జులై 1 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత జులై 14 నుంచి వన్డే సిరీస్ జరగనున్నాయి. అయితే, ఈ ప్రతిష్టాత్మక పర్యటనకు సరిగ్గా ముందే ఐర్లాండ్ చేతిలో టీమ్ ఇండియా 2-0తో క్లీన్‌స్వీప్ అవ్వడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సులువుగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పవర్‌ప్లేలో ఆశించిన స్థాయిలో పరుగులు రాకపోవడం, ఓపెనర్లు చేతులెత్తేయడం జట్టు పరాజయానికి ప్రధాన కారణాలుగా మారాయి. దీంతో ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుతో తలపడే ముందు ఓపెనింగ్ జోడీని మార్చడం అనివార్యంగా మారింది. సంజూ, అభిషేక్ జోడీ విఫలం.. నిరాశపరిచిన గణాంకాలు.. ఐర్లాండ్ సిరీస్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. మొదటి మ్యాచ్‌లో 183 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు కేవలం 148 పరుగులకే పరిమితమైంది. ఆ మ్యాచ్‌లో ఓపెనర్లు కేవలం 16 పరుగులు మాత్రమే జోడించగలిగారు. సంజూ కేవలం 5 పరుగులకే అవుట్ కాగా, అభిషేక్ శర్మ 20 బంతుల్లో 49 పరుగులు చేసి కాస్త ఆకట్టుకున్నాడు. కానీ, రెండో టీ20 మ్యాచ్‌లో ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ మొదటి

IND vs ENG : న్యూజిలాండ్ చేతిలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పుడు మరో అంతకంటే పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. అదే బలమైన టీమిండియాతో జరగబోయే పరిమిత ఓవర్ల సమరం. టెస్ట్ క్రికెట్ హడావుడి ముగిసిన తర్వాత ఇప్పుడు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ మొత్తంలో అందరి దృష్టి, క్రికెట్ విశ్లేషకుల ఫోకస్ అంతా కేవలం ఒకే ఒక్కడిపైనే ఉంది. అతడే.. టీమిండియాలోకి దూసుకొచ్చిన 15 ఏళ్ల యువ సంచలనం, సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ. అతడి ఆటను చూడటానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బుధవారం (జూలై 1, 2026) భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలంటూ అభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్ వినిపిస్తోంది. అయితే భారత జట్టు యాజమాన్యం మాత్రం తమ వ్యూహాలను బయటపెట్టలేదు. వైభవ్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తాడా లేదా అనే విషయంపై టీమిండియా ఎటువంటి క్లూ ఇవ్వలేదు. అయినప్పటికీ, ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మైదానంలోకి దిగకముందే ఆ కుర్రాడిని అడ్డుకోవడానికి ఇంగ్లీష్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందు, అంటే మంగళవారం (జూన్ 30) జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ప్రశ్నకు బ్రూక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాడిగా కనిపిస్తున్నాడు. అతడిని మేము తక్కువ అంచనా వేయడం లేదు. అయితే ఆ 15 ఏళ్ల బ్యాటర్‌ను త్వరగా అవుట్ చేయడానికి మా జట్టు ఇప్పటికే ఒక

IND vs ENG T20 : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 1 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న పాత రికార్డులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ద్విపాక్షిక సిరీస్ కోసం భారత జట్టు చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడ ఇంగ్లీష్ జట్టును వారి సొంత గడ్డపైనే 2-1 తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. పాత గెలుపు జోష్‌ను కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అయితే ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్‌లో భారత్ 0-2తో ఓడిపోవడంతో, ఈ ఇంగ్లాండ్ సిరీస్ టీమిండియాకు ఒక అగ్నిపరీక్షగా మారనుంది. గతంలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు నమోదైన కొన్ని సంచలన రికార్డులను పరిశీలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం. భారత్, ఇంగ్లాండ్ జట్లు చివరిసారిగా టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో బ్యాటర్లు బౌలర్లకు నరకం చూపించారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏకంగా 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ కేవలం 89 పరుగులతో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు కొండంత స్కోరు అందించాడు. ఆ తర్వాత కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు కూడా ఏమాత్రం తగ్గకుండా పోరాడి 246 పరుగులు చేసింది. చివరికి భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ, ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి చేసిన మొత్తం పరుగులు 499 కావడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం ఏ రేంజ్లో కురిసిందంటే, మైదానంలో ఫీల్డర్లు కేవలం బంతులను ఏరుకోవడానికే సరిపోయారు. మొత్తం మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు కలిసి 73 బౌండరీలు

IND vs ENG: ఐర్లాండ్ పర్యటనలో ఊహించని పరాభవం తర్వాత, భారత యువ జట్టు ఇప్పుడు మరో మహా సంగ్రామానికి సిద్ధమైంది. చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా బుధవారం ఇంగ్లాండ్‌తో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ పోరులో భారత్‌కు అసలైన ముప్పు ఇంగ్లీష్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ రూపంలో పొంచి ఉంది. ఐర్లాండ్ చేదు జ్ఞాపకాలను చెరిపేసేందుకు కసిగా భారత్.. వరుసగా 16 టీ20 సిరీస్‌లు గెలిచి అప్రతిహతంగా దూసుకుపోతున్న టీమిండియా విజయ పరంపరకు ఐర్లాండ్ షాకిచ్చింది. 0-2తో ఆ సిరీస్‌ను కోల్పోవడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై వారి సొంత గడ్డపైనే సత్తా చాటాలని భారత్ కసిగా ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరగబోయే కొన్ని కీలకమైన ఆటగాళ్ల పోరాటాలు (ప్లేయర్ బాటిల్స్) మ్యాచ్ ఫలితాన్ని శాసించనున్నాయి. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రీజులో ఉంటే పరుగుల సునామీ ఖాయం. కానీ, అతడిని అడ్డుకోవడానికి ఇంగ్లాండ్ తన ప్రధాన అస్త్రం జోఫ్రా ఆర్చర్‌ను రంగంలోకి దించుతోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్చర్ చేతిలో అభిషేక్ రెండు సార్లు డకౌట్‌గా వెనుతిరిగాడు. అయితే, అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం అభిషేక్ కేవలం 33 బంతుల్లోనే 61 పరుగులు సాధించి ఆర్చర్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. పవర్‌ప్లేలో వీరిద్దరి మధ్య జరిగే ఈ పోరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలవనుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో సహచరుడైన ఆర్చర్ బలాలు, బలహీనతలు సంజూ శాంసన్‌కు బాగా తెలుసు. కానీ, ఆర్చర్ సంధించే వేగవంతమైన బౌన్సర్లు శాంసన్‌ను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. గత ఏడాది 2025లో ఆర్చర్ బౌలింగ్‌లో శాంసన్ మూడు సార్లు అవుట్ కాగా, ఈ ఏడాది 2026లో మాత్రం శాంసన్ ఏకంగా 271 స్ట్రైక్ రేట్‌తో చెలరేగి పగ తీర్చుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో

IND vs ENG 1st T20I : ఐర్లాండ్ పర్యటనలో ఊహించని విధంగా 2-0 తో క్లీన్ స్వీప్ పరాభవాన్ని మూటగట్టుకున్న భారత క్రికెట్ జట్టు.. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరగబోయే 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియా మేనేజ్మెంట్కు ఒక క్రేజీ సలహా ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో బుధవారం జరగబోయే మొదటి టి20 మ్యాచ్‌లోనే 15 ఏళ్ల యువ సంచలనం, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని బరిలోకి దించాలని గవాస్కర్ గట్టిగా మొగ్గు చూపారు. ఐర్లాండ్ చేతిలో ఘోర ఓటమి తర్వాత జట్టు మైండ్‌సెట్‌ను మార్చడానికి, ఇంగ్లాండ్ జట్టును కోలుకోలేని దెబ్బ తీయడానికి ఈ కుర్రాడిని ఆడించడమే కరెక్ట్ ఆప్షన్ అని ఆయన అభిప్రాయపడ్డారు. వైభవ్ సూర్యవంశీ భయం లేని హిట్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలవడమే కాకుండా.. 237.30 అనే కళ్లు చెదిరే స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఐర్లాండ్ టూర్లో ఇతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కలేదు. సోనీ స్పోర్ట్స్‌తో గవాస్కర్ మాట్లాడుతూ.. “ఇంగ్లాండ్ బౌలర్లకు వైభవ్ బ్యాటింగ్ శైలిపై ఎలాంటి అవగాహన లేదు. వారు ఐర్లాండ్ సిరీస్ చూసి మిగిలిన ఇండియన్ బ్యాటర్లకు ఎలా బౌలింగ్ చేయాలో ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ వైభవ్‌ను ఇప్పటివరకు ఎవరూ అంతర్జాతీయ క్రికెట్లో చూడలేదు. కేవలం ఐపీఎల్ వీడియోలు మాత్రమే చూశారు. కాబట్టి అతను క్రీజులోకి వస్తే ఇంగ్లాండ్ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడు” అని విశ్లేషించారు. వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకురావడం గవాస్కర్‌కు ఇష్టమే అయినప్పటికీ.. ప్రస్తుతమున్న టాప్ ఆర్డర్ సమీకరణాల వల్ల ఇది చాలా కష్టమైన పని అని ఆయన అంగీకరించారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా స్థిరపడ్డారు, వన్ డౌన్లో ఇషాన్ కిషన్ లాంటి పటిష్టమైన బ్యాటర్ ఉన్నాడు. ఐర్లాండ్ సిరీస్‌లో సంజూ

వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటూ భారత యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న ఈ కుర్రాడు.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిలాసఫీకి పక్కాగా సరిపోతాడని నిరూపించుకున్నాడు. లంకపై మెరుపు ఇన్నింగ్స్.. పటిష్ట స్థితిలో భారత్.. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు బిగించింది. ఈ భారీ స్కోరు వెనుక యువ సంచలనం ధృవ్ జురెల్ అటాకింగ్ ఇన్నింగ్స్ పాత్ర ఎంతో ఉంది. క్రీజులో అడుగుపెట్టిన క్షణం నుంచి లంక స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ కేవలం 68 బంతుల్లోనే 75 స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు సాధించాడు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ధనుంజయ డి సిల్వా పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్‌కు జురెల్ వెనుదిరగాల్సి వచ్చింది. మైదానాన్ని వీడే ముందు అతడు జట్టుకు అందించాల్సిన ఊపును అందించాడు. ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..! గంభీర్ మంత్రం వంటబట్టించుకున్న కుర్రాడు.. ఈ అర్ధశతకం అనంతరం జురెల్ చేసిన కామెంట్స్ యావత్ భారత క్రీడాభిమానుల మనసు గెలుచుకున్నాయి. "నేనెప్పుడూ నా వ్యక్తిగత మైలురాళ్ల కోసం క్రికెట్ ఆడను, ఆ సమయానికి జట్టుకు ఎలాంటి బ్యాటింగ్ అవసరమో అలా ఆడేందుకే ప్రాధాన్యత ఇస్తాను" అని అతడు కుండబద్దలు కొట్టాడు. ఈ మాటలు విన్న క్రికెట్ పండితులకు వెంటనే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గుర్తుకు వచ్చాడు. 2024 మధ్యలో కోచ్ బాధ్యతలు చేపట్టిన గంభీర్ మొదటి నుంచి చెబుతున్న మాటలనే జురెల్

Team India : వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచి ప్రపంచ క్రికెట్‌ను శాసించిన భారత జట్టు.. ఇప్పుడు ఒకే ఒక్క విజయం కోసం ఇంతలా తల్లడిల్లుతుందని ఎవరూ ఊహించలేదు. టీమిండియా ప్రస్తుత ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా భారత జట్టు మొత్తం ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత క్రికెట్ చరిత్రలోనే వరుసగా ఆరు టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంతటి ఘోర అవమానకరమైన ఓటములకు అసలు బాధ్యులు ఎవరు? మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలే జట్టును ముంచాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, భారత క్రికెట్ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దారిలోనే నడుస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ జట్టులో సాధారణంగా కెప్టెన్, కోచ్‌లకు నచ్చిన వారికి, వారి స్నేహితులకే జట్టులో చోటు కల్పిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ దేశవాళీ క్రికెట్లో ఎంత బాగా రాణించినా సరే, కెప్టెన్ అనుగ్రహం లేకపోతే జట్టులోకి రాలేరు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు టీమిండియాలోనూ ఇదే తరహా సంస్కృతి కనిపిస్తోందని విమర్శకులు మండిపడుతున్నారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లను జట్టులోనే ఎందుకు కొనసాగిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. గంభీర్, శ్రేయస్ అయ్యర్ దోస్తీ వల్లే జట్టు సర్వనాశనమా? టీ20 జట్టు ఎంపికలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా సూర్యాంశ్ శెడ్గేను ఏ ప్రాతిపదికన జాతీయ జట్టులోకి తీసుకున్నారనే దానికి సమాధానం లేదు. సూర్యాంశ్ శెడ్గేకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరిదీ ఒకే డొమెస్టిక్ టీమ్ కావడమే కాకుండా

భారత క్రికెట్లో మోస్ట్ టాలెంటెడ్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లండ్ పర్యటన అస్సలు కలిసి రాలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఈ యంగ్ బ్యాటర్ దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. ఈ సిరీస్‌లో వరుసగా అవకాశాలు వచ్చినా వాటిని వైభవ్ ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో ఐదో మ్యాచ్‌లో అతడిని పక్కన పెట్టాల్సి వచ్చింది. అసలు ఇంత హైప్ ఉన్న ప్లేయర్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? దీని వెనుక ఉన్న కారణాలను డొమెస్టిక్ క్రికెట్లో ఏకంగా 67 సెంచరీలు బాదిన టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఓపెన్‌గా మాట్లాడారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి రెండో, మూడో, నాలుగో మ్యాచ్‌ల్లో ఆడే ఛాన్స్ దక్కింది. కానీ, ఇంగ్లండ్ పిచ్‌లపై మనోడు అస్సలు నిలదొక్కుకోలేకపోయాడు. మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్‌లో జరిగిన మ్యాచ్‌లలో వైభవ్ వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. పవర్‌ప్లేలో భారీ హిట్టింగ్ చేయాల్సిన ఓపెనర్ ఇలా వరుసగా ఫెయిల్ అవ్వడంతో.. సౌతాంప్టన్‌లో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి డ్రాప్ చేశారు. అతడి ప్లేస్‌లో సంజూ శాంసన్‌కు టీమ్‌లో చోటు ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ అవ్వడంపై వసీం జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వైభవ్‌ను టీమ్‌లోకి తీసుకోవడంలో సెలక్టర్లు చాలా తొందరపడ్డారని జాఫర్ అన్నాడు. "మీడియాలో వైభవ్ గురించి విపరీతమైన చర్చ నడిచింది. అతడి ఆటను చూడటానికి అభిమానులు కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు. కానీ, నా ఉద్దేశంలో వైభవ్‌ను తీసుకురావడంలో మనం కాస్త తొందరపడ్డాం. నిజానికి నేను మొదటి నుంచి చెప్తున్నట్లే.. ఐదు మ్యాచ్‌ల్లోనూ సంజూ శాంసన్‌తోనే ముందుకు వెళ్లాల్సింది" అని జాఫర్ చెప్పుకొచ్చాడు. యంగ్ ప్లేయర్లకు ఛాన్సులు ఇచ్చేటప్పుడు కాస్త టైమ్ ఇవ్వాలని జాఫర్ సూచించాడు. "నేనైతే టీమ్ కాంబినేషన్‌ను అస్సలు

భారత క్రికెట్లో సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీ, లండన్‌లోని ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ వేదికపై అరుదైన అనుభూతిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌ను భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, టీ20 స్టార్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలతో కలిసి ఐకానిక్ సెంటర్ కోర్ట్ నుంచి వైభవ్ ప్రత్యక్షంగా వీక్షించాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం భారత క్రికెటర్లు ఈ గ్రాండ్ స్లామ్ ఈవెంట్లో సందడి చేశారు.ఈ సందర్భంగా జియోస్టార్‌తో మాట్లాడిన వైభవ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా వేదికలలో ఒకటైన ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌కు రావడం ఇదే మొదటిసారని, ఇదొక గొప్ప అనుభవమని ఆనందం వ్యక్తం చేశాడు. "ఫైనల్స్ వంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఎలా రాణిస్తారో ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవాలనే లక్ష్యంతోనే ఇక్కడికి వచ్చాను" అని ఈ యువ క్రికెటర్ తన పర్యటన ఉద్దేశాన్ని వివరించాడు.గత నాలుగైదేళ్లుగా తాను టెన్నిస్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నానని వైభవ్ తెలిపాడు. చిన్నప్పటి నుంచి రాఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్‌ల ఆటను చూసేవాడినని, ముఖ్యంగా జొకోవిచ్ అంటే తనకు అమితమైన ఇష్టమని (ఐడల్) వెల్లడించాడు. అయితే ఈ టోర్నీలో మాత్రం కొత్త తరం ఆటగాడు, ప్రపంచ నంబర్ 1 జాన్నిక్ సినర్‌కు మద్దతిచ్చానని, అతడి ఆటతీరు అద్భుతమని కొనియాడాడు.ఈ ప్రత్యేకమైన మ్యాచ్ కోసం కోట్, సూట్ ధరించి క్లాసిక్ లుక్‌లో కనిపించడంపై స్పందిస్తూ.. తన సీనియర్ అభిషేక్ శర్మ ఈ

Team India : ఐర్లాండ్ పర్యటనలో క్లీన్‌స్వీప్ అయిన తర్వాత, ఇంగ్లండ్ గడ్డపై కూడా భారత టీ20 జట్టు 0-4తో సిరీస్‌ను దారుణంగా చేజార్చుకుంది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ అవలంబిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టు వ్యూహాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓపెనర్లు సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీలను పదే పదే మారుస్తూ మేనేజ్మెంట్ మ్యూజికల్ చైర్స్ ఆట ఆడుతోందని ఆయన మండిపడ్డారు. ఆటగాళ్లకు సరైన భరోసా ఇవ్వకపోవడం వల్లే జట్టులో అస్థిరత ఏర్పడిందని, ఇది తనను ఎంతగానో ఆందోళనకు గురిచేస్తోందని అశ్విన్ ఓపెన్‌గా చెప్పారు. ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ ప్రదర్శనను ఉదాహరణగా చూపిస్తూ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ యాష్ కి బాత్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చివరి మ్యాచ్‌లో జోస్ బట్లర్ 131 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అంతకుముందు మూడు ఇన్నింగ్స్‌లలో అతను కేవలం 44 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. అయినప్పటికీ ఇంగ్లండ్ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచి జట్టులోనే కొనసాగించింది. ఫలితంగా చివరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. కానీ మన జట్టులో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ శాంసన్‌ను కేవలం మూడు మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయ్యాడని జట్టు నుంచి తీసేశారు. ఇంగ్లండ్ లాగా శాంసన్‌కు వరుసగా అవకాశాలు ఇచ్చి ఉంటే, బహుశా అతను కూడా ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదేవాడేమో” అని అశ్విన్ అభిప్రాయపడ్డారు. చివరి ఐదో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేసి, మళ్లీ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో శాంసన్ కేవలం 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి మంచి టచ్‌లో

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమ్ ఇండియా దారుణమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక తీవ్ర విమర్శల పాలవుతోంది. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 సెలెక్షన్, ఆటగాళ్ల ఫామ్‌పై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుతోనే ఆడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, భారత మాజీ ఓపెనర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత జట్టులో లేని ఆటగాళ్లతో ఒక ప్రత్యామ్నాయ బలమైన భారత టీ20 జట్టును ప్రకటించారు. ఈ టీమ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఛాంపియన్ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆకాశ్ చోప్రా ప్రకటించిన ఈ కొత్త జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 2026లో భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించి సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా నిలిచిన సూర్యను సెలెక్టర్లు ఆ తర్వాత నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించి, ఏకంగా జట్టు నుంచే డ్రాప్ చేశారు. అయితే భారత్ మళ్లీ పుంజుకోవాలంటే సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాడి అవసరం ఎంతైనా ఉందని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. అందుకే తన టీమ్ లో సూర్యను బాస్ చేసేశారు. ఐపీఎల్లో వరుసగా రెండోసారి ఆర్సీబీకి ట్రోఫీ అందించి ఛాంపియన్‌గా నిలిపిన రజత్ పాటిదార్‌కు ఆకాశ్ చోప్రా జట్టులో అద్భుత అవకాశం దక్కింది. పాటిదార్‌ను టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని అభిమానుల నుంచి డిమాండ్ వస్తున్న తరుణంలో, చోప్రా ఏకంగా అతడిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. పాటిదార్‌తో పాటు ఈ టీమ్‌లో ఆర్సీబీకి చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. ఆల్‌రౌండర్ కోటాలో క్రునాల్ పాండ్యా, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌లను కూడా చోప్రా లైన్లోకి తెచ్చారు. ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్

Vaibhav Sooryavanshi Dropped: ఇంగ్లాండ్‌తో సౌతాంప్టన్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి ఐదో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై వేటు పడింది. అతని స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. కేవలం వారం క్రితమే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి, అత్యంత పిన్న వయసులో భారత్ తరపున ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన సూర్యవంశీ.. ఇప్పుడు కనీసం రాబోయే రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ ప్రణాళికల్లో లేని 15 ఏళ్ల కుర్రాడు? ఐదో టీ20 మ్యాచ్ టాస్ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై అయ్యర్ ఒక పెద్ద బాంబ్ పేల్చాడు. "ఈ మ్యాచ్‌లో మేము రెండు మార్పులు చేశాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాన్ష్ షెడ్జ్, సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చారు. భవిష్యత్తులో జట్టుకు ఏది మంచిదో, ఎలాంటి కాంబినేషన్లు సరిపోతాయో ప్రయోగించి చూడాల్సిన సమయం ఇది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని అయ్యర్ స్పష్టం చేశాడు. దీన్ని బట్టి చూస్తే, 2028 టీ20 వరల్డ్ కప్ కోసం మేనేజ్మెంట్ సిద్ధం చేస్తున్న రోడ్‌మ్యాప్‌లో ప్రస్తుతానికి సూర్యవంశీకి చోటు లేదని స్పష్టమవుతోంది. ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2026 హీరో.. ఇంటర్నేషనల్ క్రికెట్లో జీరో..! ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్ సూర్యవంశీ.. అత్యధిక పరుగులు సాధించి ప్రతిష్టాత్మకమైన 'ఆరెంజ్ క్యాప్' గెలుచుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే అతను ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఐర్లాండ్ పర్యటనలో బెంచ్‌కే పరిమితమైన ఈ 15 ఏళ్ల వండర్ కిడ్.. ఇంగ్లాండ్‌తో

ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎంపిక వివాదానికి దారితీసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టి, ఫామ్‌లో లేని సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.సిరీస్ ఫలితం ఇప్పటికే తేలిపోయిన నేపథ్యంలో, ఈ నామమాత్రపు మ్యాచ్‌లో యువ ఆటగాడిని పక్కనపెట్టడంపై సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "వైభవ్‌ను తీసుకోకపోవడం నన్ను చాలా నిరాశపరిచింది. ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్ అయితే, అనుభవం ఉన్న ఆటగాడిని ఆడించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో ఒక యువ ప్రతిభావంతుడికి అవకాశం ఇవ్వకపోవడం పెద్ద తప్పు. ఎవరో ఒకరు ఆ పిల్లాడి భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పాలి. కేవలం మూడు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా 15 ఏళ్ల బాలుడిని జట్టు నుంచి తొలగించడం చాలా కఠినమైన నిర్ణయం" అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.మరోవైపు, ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కూడా భారత యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు. "వైభవ్‌ను భవిష్యత్ సూపర్ స్టార్ అని నమ్మినప్పుడు, అతడికి కేవలం మూడు మ్యాచ్‌లు ఇచ్చి ఎలా వదిలేస్తారు? ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతడు తన సత్తా చూపించాడు. ఫామ్ లేక 5, 0, 1 పరుగులు చేసిన శాంసన్‌ను మళ్ళీ తెచ్చారు. అతడి కంటే 13, 14

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఆఖరి దశకు చేరుకుంది. సౌతాంప్టన్ వేదికగా ఐదో, చివరి టీ20 మ్యాచ్ జరగబోతోంది. అయితే, భారత జట్టు ఇప్పటికే ఈ సిరీస్‌ను చేజార్చుకోవడంతో, కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కాపాడుకోవాలన్నా, క్లీన్ స్వీప్ అవమానం తప్పాలన్నా ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కొన్ని కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా గత కొన్ని మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితమైన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మళ్లీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న.. సంజూ శాంసన్ జట్టులోకి వస్తే ఎవరి స్థానానికి ఎసరు పెడతాడు. గత మ్యాచ్‌ల్లో శాంసన్‌ను పక్కనబెట్టి 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 14 సగటుతో 42 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఐపీఎల్లో తన సహచర బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వైభవ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒకవేళ వైభవ్‌ను పక్కనబెట్టకపోతే, ఫామ్ లేమితో సతమతమవుతున్న ఇషాన్ కిషన్ లేదా కెప్టెన్ తిలక్ వర్మలలో ఒకరిపై వేటు పడే అవకాశం ఉంది. ఇషాన్ 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 66 పరుగులు చేయగా, తిలక్ వర్మ మొదటి 4 మ్యాచ్‌ల్లో 51 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యారు. టాప్ ఆర్డర్లో రైట్ హ్యాండ్ బ్యాటర్ అవసరం సంజూ శాంసన్ గనుక తుది జట్టులోకి వస్తే భారత టాప్ ఆర్డర్లో ఒక రైట్ హ్యాండ్ బ్యాటర్ అందుబాటులోకి వస్తాడు. ఇది జట్టు సమతుల్యతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శాంసన్‌తో పాటు ఈ

Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై చర్చ కొనసాగుతున్న వేళ మాజీ వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం భావోద్వేగపరంగా సరైన నిర్ణయమే అయినప్పటికీ, ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడాన్ని సమర్థించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో సంజూకు నిలకడలేమి అనే విమర్శలు ఎదురైనా, ఇటీవలి కాలంలో అతను తన ఆటతీరుతో ఆ విమర్శలను అధిగమించాడని పార్థివ్ పేర్కొన్నారు. ఒకే ఆటగాడిని వేర్వేరు ప్రమాణాలతో అంచనా వేయకూడదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తు దృష్ట్యా యువ ప్రతిభకు అవకాశాలు ఇవ్వడం అవసరమే అయినా, ప్రస్తుత ప్రదర్శనను విస్మరించరాదని సూచించారు. అదే సమయంలో, భారత క్రికెట్లో జట్టులో లేని ఆటగాడే అత్యుత్తమ ఎంపికగా కనిపిస్తాడనే అభిమానుల మనస్తత్వాన్ని కూడా పార్థివ్ ప్రస్తావించారు. యువతకు అవకాశాలు కల్పించడం, అనుభవజ్ఞులకు న్యాయం చేయడం మధ్య సమతుల్యతను పాటించడమే సెలెక్టర్ల ముందున్న అసలు సవాలని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. జియోస్టార్‌తో మాట్లాడుతూ పార్థివ్ పటేల్, గత 11-12 ఏళ్లుగా సంజు శాంసన్ కెరీర్‌ను ఒకే ప్రశ్న వెంటాడుతోందని అన్నారు.. అదే అతని నిలకడ. ఈ కారణంగా అతన్ని జట్టు నుండి చాలాసార్లు తొలగించారు, కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. సంజు శాంసన్‌ను ఎందుకు ఎప్పుడూ పక్కన పెడుతున్నారు? గతంలో అతను నిలకడగా పరుగులు చేయడం లేదని లేదా వేగంగా బ్యాటింగ్ చేయడం లేదని అనేవారు. కానీ ఒకే ఆటగాడిని వేర్వేరు కొలమానాల ఆధారంగా అంచనా వేయలేం అన్నారు పార్థి్వ్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం భావోద్వేగపరంగా సరైన నిర్ణయమేనని, ఎందుకంటే అతను భారత క్రికెట్లో చాలా ప్రతిభావంతుడైన యువ తార అని పార్థివ్ ఇంకా పేర్కొన్నాడు. అయితే, ఎంపిక కేవలం ప్రదర్శన మరియు తర్కం ఆధారంగానే జరిగితే, సంజు శాంసన్ ను పక్కన పెట్టడానికి బలమైన కారణం

England vs India, 5th T20I: ప్రస్తుతం భారత టీ20 క్రికెట్ జట్టు ప్రదర్శన క్రీడాభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పొట్టి ప్రపంచకప్ గెలిచిన మన టీం ఇండియా, విదేశీ పర్యటనలో వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న భారత జట్టు, ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ లోనూ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. పరువు నిలుపుకోవడమే లక్ష్యంగా జరగబోయే చివరి మ్యాచ్ కోసం తుది జట్టులో కీలక మార్పులకు యాజమాన్యం సిద్ధమైంది. క్లీన్ స్వీప్ అవమానం నుంచి తప్పించుకునేలా.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌లలో భారత్ మూడు మ్యాచ్‌లలో ఘోరంగా ఓడిపోయింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, 0-3 తేడాతో టీం ఇండియా సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చింది. రేపు జరగబోయే చివరి పోరులో కూడా ఓడిపోతే మాత్రం మరో క్లీన్ స్వీప్ అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగైనా ఈ ఘోర పరాజయం నుంచి తప్పించుకుని పరువు దక్కించుకోవాలంటే చివరి మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. వైభవ్ సూర్యవంశీపై నమ్మకం.. సంజూ శాంసన్‌కు పిలుపు..! యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఘోరంగా విఫలమైనప్పటికీ, అతనిపై జట్టు యాజమాన్యం ఇంకా నమ్మకం ఉంచింది. చివరి మ్యాచ్‌లో కూడా అతనికి ఓపెనర్‌గా మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకురానున్నారు. సంజూ శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండగా, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణలపై వేటు..! గత మ్యాచ్‌లలో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఘోరంగా విఫలమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టు నుంచి తప్పించడం

యూకే పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షార్పణం కాగా, తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలై సిరీస్‌ను ఇంగ్లండ్‌కు అప్పగించింది. ఐపీఎల్లో కెప్టెన్‌గా విజయవంతమైన శ్రేయస్ అయ్యర్.. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. తొలి విజయం కోసం అతడు అతృతగా ఎదురు చూస్తున్నాడు. అతడి సారథ్యంలో భారత్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓటమి పాలై రెండు సిరీస్‌లను కోల్పోయింది. ఇక యూకే టూర్లో భారత బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమైంది. కెప్టెన్ శ్రేయస్, అభిషేక్ శర్మ మినహా మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు. టీ20 ప్రపంచకప్-2026 హీరో సంజూ శాంసన్ కూడా ఈ పర్యటనలో నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం కావడంతో సంజూను తుది జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశమిచ్చారు. కానీ భారీ అంచనాలతో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలు పెట్టిన వైభవ్.. తన మొదటి మూడు మ్యాచ్‌లలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మూడు మ్యాచ్‌లు కలిపి కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. కిషన్‌కు ఏమైంది? మరోవైపు వరల్డ్ నంబర్ టీ20 బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన కిషన్.. ఆ ఫామ్‌ను యూకే పర్యటనలో మాత్రం కొనసాగించలేకపోయాడు. ఒకేరకమైన బంతులకు పదే పదే అవుట్ అవుతూ నిరాశపరుస్తున్నాడు. గత 6 ఇన్నింగ్స్‌ల్లో ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని యావరేజ్ 13.2 కాగా, స్ట్రైక్ రేట్ 108.2 మాత్రమే. సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీల గురించిన చర్చల నడుమ.. కిషన్ వైఫల్యాలు అంతగా హైలెట్ కాలేదు. కానీ

భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 హీరో సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై మాట్లాడాడు. ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 హీరో సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై చర్చ కొనసాగుతూనే ఉంది. యువ బ్యాటర్ వైభవ్ సూర్యంశీ కోసం సంజును తప్పించారనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్.. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో సంజును తప్పించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై మాట్లాడాడు. ‘గత 11-12 ఏళ్లుగా సంజు శాంసన్ కెరీర్‌ను చూస్తే అతడిని వెంటాడిన ఒకే ఒక్క ప్రశ్న నిలకడ. గతంలో అతడి అస్థిర ప్రదర్శనల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కానీ ఇప్పుడు ఎందుకు సంజునే పక్కన పెట్టారనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం ఒక పరంగా సరైన నిర్ణయం కావచ్చు. అయితే పూర్తిగా తార్కికంగా చూస్తే సంజు శాంసన్‌ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదు. వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు. జట్టులో లేని ఆటగాడే మెరుగ్గా ఆడేవాడని మనం ఎప్పుడూ భావిస్తుంటాం. గత టీ20 ప్రపంచ కప్ సమయంలో శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో అతడినే కోరారు. ఇప్పుడు అతడు జట్టులోకి రాగానే ఆర్సీబీకి రెండుసార్లు కప్ అందించిన కెప్టెన్ రజత్ పాటీదార్‌కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఇలాంటి చర్చలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి’ అని పార్థివ్ పటేల్ వెల్లడించాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను ఓ

India vs England 4th T20 Highlights: భారత క్రికెట్ జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ చేతులెత్తేసిన భారత్, ఇంగ్లండ్‌కు సిరీస్‌ను సమర్పించుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అట్టర్ ఫ్లాప్ బ్యాటింగ్.. వైభవ్ సూర్యవంశీ కోసం సంజూ శాంసన్‌కు మొండిచేయి! టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌గా వచ్చిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ వంటి మేటి ఆటగాడిని పక్కనపెట్టి మరీ ఇతనికి అవకాశమిస్తే, వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 4 పరుగులకే వెనుదిరగ్గా, స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ 16 పరుగులకే ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోవైపు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 5 పరుగులకే అవుటై తన ఫామ్‌లేమిని చాటుకున్నాడు. అసలు ఇతడిని జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారో దేవుడికే తెలియాలంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శివమ్ దూబే (22 పరుగులు) కొద్దిసేపు నిలబడినా వేగంగా ఆడలేకపోయాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం.. ఒకే ఒక్కడు! ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సింహంలా పోరాడాడు. 49 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ చేసిన ఈ పరుగుల వల్లే భారత్ కనీసం ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. మిగిలిన బ్యాటర్లంతా అటూ ఇటూ వచ్చి వెళ్లడంతో

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ద్ కృష్ణలను తుది జట్టులోకి తీసుకున్నారు. సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం అయినా కూడా వైభవ్ సూర్యవంశీ పై మేనేజ్మెంట్ నమ్మకాన్ని ఉంచింది. 🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bat first in Bristol. Updates ▶️ #ENGvIND — BCCI (@BCCI) July 9, 2026 Team India : లార్డ్స్‌లో తొలిసారి మహిళల టెస్టు క్రికెట్.. భారత మహిళా క్రికెటర్ల ఫోటోలు వైరల్.. 'మేం తొలుత బ్యాటింగ్ చేస్తాం. మొదటి రెండు మ్యాచ్‌లలో మేము అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. కానీ ఈ రోజు ఒక కొత్త రోజు, కొత్త ప్రారంభం. ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వికెట్ చూసేందుకు బాగుంది. పిచ్ మీద గడ్డి ఉంది. కాబట్టి తొలి బంతి నుంచే అది ఎలా ఆడుతుందో ఖచ్చితంగా చూస్తాము. ఇక తుది జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. వరుణ్, అర్ష్‌దీప్ స్థానాల్లో వాషింగ్టన్, ప్రసిద్ధ్ జట్టులోకి వచ్చారు.' అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇంగ్లాండ్ తుది జట్టు.. ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్. Here's a look at #TeamIndia's Playing XI for the 4️⃣th T20I 🙌 Updates ▶️ #ENGvIND — BCCI (@BCCI) July 9, 2026 భారత తుది

IND vs ENG 4th T20 : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగో పోరు జూలై 9వ తేదీ గురువారం బ్రిస్టల్ వేదికగా జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 0-2తో వెనుకబడిన టీమిండియాకు సిరీస్ గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ, మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచి సిరీస్‌ను కనీసం డ్రా చేసుకునే సువర్ణ అవకాశం ఉంది. అందుకోసం బ్రిస్టల్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇంగ్లాండ్‌ను అడ్డుకోవాలంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు చేయక తప్పదు. ఈ నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మళ్లీ జట్టులోకి వస్తాడా, వస్తే ఎవరి స్థానంలో వస్తాడనే చర్చలు జోరందుకున్నాయి. భారత బ్యాటింగ్ లైనప్‌లో లెఫ్ట్ హ్యాండర్స్ రద్దీ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడానికి మొదటి ముఖ్యమైన కారణం.. ప్రస్తుత భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉండటం. ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలతో పాటు నంబర్-3లో ఆడే ఈషాన్ కిషన్ కూడా లెఫ్ట్ హ్యాండరే. వీరితో పాటు అక్షర్ పటేల్, తిలక్ వర్మ, శివమ్ దూబే కూడా ఎడమచేతి వాటంతోనే బ్యాటింగ్ చేస్తారు. మిడిల్ ఆర్డర్లో రైట్ హ్యాండ్ ఉన్న ఏకైక బ్యాటర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రమే. గత మ్యాచ్‌లో ఈ కారణం చేతనే శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపించారు. క్రీజులో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉంటే బౌలర్లకు ప్లాన్స్ మార్చడం కష్టమవుతుంది కాబట్టి, రైట్ హ్యాండర్ అయిన సంజూ శాంసన్ రాక జట్టుకు ఎంతో అవసరం. సంజూ శాంసన్ జట్టులోకి రావడానికి రెండో కారణం.. అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితులను అతను ఎదుర్కొనే విధానం. అంతర్జాతీయ క్రికెట్ అయినా, ఐపీఎల్ అయినా ఒత్తిడిలో రాణించగలనని సంజూ గతంలో చాలాసార్లు నిరూపించాడు. గత

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుస ఓటములతో భారత క్రికెట్ జట్టు తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. ప్రస్తుతం ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 0–2తో వెనుకంజలో ఉండటంతో, సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే బ్రిస్టల్‌లో జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలు ఆశించిన స్థాయిలో సఫలం కాకపోవడం, గత మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ లైనప్ ఘోరంగా కుప్పకూలడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, సిరీస్ చేజారకుండా కాపాడుకునేందుకు టీమిండియా మేనేజ్మెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ కీలక పోరులో అందరి దృష్టి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కమ్బ్యాక్పైనే ఉంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026 అద్భుత విజయ ప్రస్థానంలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజు శాంసన్‌ను, ఆ తర్వాత ఫామ్ లేమి కారణంతో పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు జట్టు కష్టాల్లో ఉండటంతో అతని అనుభవం భారత మిడిలార్డర్‌కు ఎంతో అవసరమనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం సంజు శాంసన్ తిరిగి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అతను బరిలోకి దిగితే మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు, వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్న యువ ప్లేయర్ తిలక్ వర్మపై ఈ మ్యాచ్‌లో వేటు పడే ఛాన్స్ స్పష్టంగా ఉంది. ఇంగ్లాండ్ పిచ్‌లపై పేస్, బౌన్స్‌ను తట్టుకోలేక గత మ్యాచ్‌లో తిలక్ వర్మ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం 11 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ లాంటి దిగ్గజాలు సైతం తిలక్ వర్మను పక్కన పెట్టి, సంజు శాంసన్‌కు తక్షణమే అవకాశం ఇవ్వాలని బహిరంగంగానే సూచించారు. దీంతో తిలక్ ఈ మ్యాచ్‌లో

ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఇవాళ(గురువారం) నాలుగో టీ20 జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈనేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్పై మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ విమర్శలు చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్, టీమిండియా(Ind vs Eng) మధ్య ఇవాళ(గురువారం) నాలుగో టీ20 జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఇప్పుడీ మ్యాచ్‌లో గెలిస్తేనే కనీసం సిరీస్‌ను సమం చేసేందుకైనా అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గత మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపని తిలక్ వర్మను పక్కన పెట్టి సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ (క్రిష్) సూచించాడు. అదే సమయంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న తిలక్ వర్మ ఇలాగే నెమ్మదిగా ఆడితే భవిష్యత్తులో సారథి అవుతాడంటూ పరోక్షంగా సెటైర్లు వేశాడు. ఓ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో క్రిష్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘తిలక్ వర్మ (Tilak Varma) ఇప్పుడు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. భవిష్యత్తులో కెప్టెన్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతడు క్రీజ్‌లోకి వచ్చాక ఔట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఆడుతున్నట్లు అనిపిస్తుంది. బంతి వేగం, బౌన్స్‌ను చూసి స్ట్రైకింగ్‌కు వెళ్లకూడదని భావించి ఉండొచ్చు. అందుకే, తిలక్ స్థానంలో శాంసన్ ను ఆడించడం కాస్త నయం' అని క్రిష్ పేర్కొన్నాడు. 'తిలక్‌ను మీరు(టీమిండియా మేనేజ్మెంట్) ప్రధాన బ్యాటర్‌గా తీసుకున్నారు. పేసర్లను ఎదుర్కొనే విషయంలో అతడిని వెనుకేసుకొస్తున్నారు. తిలక్ కంటే ముందు అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపించారు. షార్ట్ పిచ్ బంతులకు వైస్ కెప్టెన్ ఇబ్బంది పడుతున్నాడని మేనేజ్మెంట్కు తెలుసు. తిలక్‌ను జట్టు నుంచి తప్పించాలని.. అప్పుడే మెరుగ్గా మారి వస్తాడని పదేపదే చెబుతున్నా. కానీ, అలా చేయడం లేదు’ అని క్రిష్(Krishnamachari Srikkanth) వ్యాఖ్యానించాడు. మొత్తంగా టీమిండియా మేనేజ్మెంట్పై క్రిష్ శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 కోసం టీమ్ఇండియా (Team India Ready) సన్నద్ధమవుతోంది. మొదటిది రద్దవడం, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో భారత జట్టు సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఇప్పుడీ మ్యాచ్‌లో గెలిస్తేనే కనీసం సిరీస్‌ను సమం చేసేందుకైనా అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పెద్దగా ప్రభావం చూపించని తిలక్ వర్మను పక్కన పెట్టి సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని క్రిష్ణమాచారి శ్రీకాంత్ (క్రిష్) సూచించాడు. అదే సమయంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న తిలక్ వర్మ (Vice Captain Tilak Varma) ఇలాగే నెమ్మదిగా ఆడితే భవిష్యత్తులో సారథి అవుతాడంటూ చురకలంటించాడు. మరోవైపు మాజీ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం జట్టులో ఎలాంటి మార్పులు చేయొద్దని సూచించడం గమనార్హం. ‘‘తిలక్ వర్మ (Tilak Varma) ఇప్పుడు జట్టుకు వైస్ కెప్టెన్. భవిష్యత్తులో కెప్టెన్ కూడా అయ్యే అవకాశం ఉంది. అతడు క్రీజ్‌లోకి వచ్చాక ఔట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఆడుతున్నట్లు అనిపించింది. బంతి వేగం, బౌన్స్‌ను చూసి స్ట్రైకింగ్‌కు వెళ్లకూడదని భావించి ఉండొచ్చు. ఆ సమయంలో అతడికి ఏం చేయాలో తోచడం లేదు. అందుకే, తిలక్ స్థానంలో సంజును ఆడించడం కాస్త నయం. తిలక్‌ను మీరు ప్రధాన బ్యాటర్‌గా తీసుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొనే విషయంలో అతడిని వెనుకేసుకొస్తున్నారు. తిలక్ కంటే ముందు అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపించారు. షార్ట్ పిచ్ బంతులకు వైస్ కెప్టెన్ ఇబ్బంది పడుతున్నాడని మేనేజ్మెంట్కు తెలుసు. అతడిని జట్టు నుంచి తప్పించాలని.. అప్పుడే మెరుగ్గా మారి వస్తాడని పదేపదే చెబుతున్నా. కానీ, అలా చేయడం లేదు’’ అని క్రిష్ వ్యాఖ్యానించాడు. తిలక్ వర్మను పక్కన పెట్టి సంజు శాంసన్ (Sanju Samson)ను తీసుకోవాలనే వాదనను అభిషేక్ నాయర్ తప్పుబట్టాడు. ‘‘సంజును తీసుకురావాలంటే అతడు ఎక్కడ సక్సెస్ అయ్యాడో ఆ ప్లేస్లోనే ఆడించాలి. అంతేకానీ, వేరే

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలు చవిచూస్తుండటంతో జట్టుపై విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆటతీరు నిరాశపరుస్తోందంటూ భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిలక్‌కు బదులుగా సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించారు.తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన శ్రీకాంత్.. ‘‘తిలక్ వర్మ పూర్తిగా అయోమయంలో ఉన్నాడు. అతని స్థానంలో నేను సంజూ శాంసన్‌కే అవకాశం ఇస్తాను. వైస్ కెప్టెన్‌గా నియమించిన ఆటగాణ్ని ఎందుకు కాపాడుతున్నారు?’’ అని ప్రశ్నించారు. తిలక్‌కు షార్ట్ పిచ్ బంతులు బలహీనత అని తెలిసే అక్షర్ పటేల్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపుతున్నారని, జట్టు యాజమాన్యం తప్పుడు సంకేతాలు ఇస్తోందని విమర్శించారు.వైస్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత తిలక్ వర్మ 19, 55, 13, 24 నాటౌట్, 3 పరుగులు మాత్రమే చేశాడు. ఐర్లాండ్‌పై చేసిన 55 పరుగుల ఇన్నింగ్స్ మినహా అతడు ప్రభావం చూపలేకపోయాడు. ఇంగ్లండ్ పర్యటనలోనూ బ్యాటింగ్ విభాగం వరుసగా విఫలమవుతుండటంతో జట్టు ఎంపిక, నాయకత్వ నిర్ణయాలపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి

భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో చర్చనీయాంశంగా మారిన సంజూ, విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవాలని మంజ్రేకర్ పిలుపునిచ్చాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన శాంసన్, అనంతరం యూకే పర్యటనలో తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం ఆరు పరుగులు మాత్రమే చేయడంతో అతడి స్థానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభించింది. ఆ తర్వాత జింబాబ్వే సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులోనూ సంజూకు చోటు దక్కలేదు. ఈ నిర్ణయంపై స్పందించిన మంజ్రేకర్, "సంజూ శాంసన్‌ను తప్పించడానికి సరైన కారణం ఏదైనా ఉంటే అది ఫిట్నెస్ మాత్రమే. అదే కారణమైతే ఆ నిర్ణయం సమంజసమే. ప్రస్తుతం అతను అత్యుత్తమ శారీరక దృఢత్వంలో లేడు. ఈ దశలో విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని ఫిట్‌నెస్‌పై పూర్తిగా దృష్టి సారించాలి" అని సూచించాడు. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత సంజూ తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఒక శిక్షణా సెషన్‌కు దూరంగా ఉండి జిమ్‌లోనే ప్రత్యేకంగా వ్యాయామం చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఫిట్నెస్ విషయంలో సంజూపై విమర్శలు రావడంతో, ఇప్పుడు అతడికి ఇది కీలక దశగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇంగ్లండ్‌తో మూడో టీ20 అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సంజూ శాంసన్ భవిష్యత్తుపై స్పందించాడు. "2026 ప్రపంచకప్‌లో సంజూ చేసిన ప్రదర్శన అసాధారణం. అయితే కొన్నిసార్లు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సంజూ ఇక జట్టులోకి రాలేడనే నిబంధన ఏమీ లేదు. ప్రతి ఆటగాడు తన స్థానాన్ని తన ప్రదర్శనతో సంపాదించుకోవాలి" అని గంభీర్ స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో మిగిలిన మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్‌కు

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ గురువారం రాత్రి 10:00 గంటలకు (IST) బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్లో జరగనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన టీమ్ ఇండియా 0-2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే ఈ నాలుగో మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలవాలి. అందుకే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్లేయింగ్-11లో రెండు పెద్ద మార్పులు చేసేందుకు రెడీ అయ్యాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా వరుసగా ఫ్లాప్ అవుతున్న ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మపై వేటు పడేలా ఉంది. అతని పేలవ ఫామ్ వల్ల టీమ్‌లో ప్లేస్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు తిలక్ వర్మ ప్లేస్‌లోకి స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్‌కు ఆడే ఛాన్స్ రాలేదు. అయితే టీమ్ ఇండియాకు ఇప్పుడు సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అవసరం కాబట్టి, సంజూని మళ్లీ టీమ్‌లోకి తీసుకునే ప్లాన్ చేస్తున్నారు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజూ శాంసన్ ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడాడు. కానీ ఆ తర్వాత 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం కోసం సంజూని పక్కన పెట్టాల్సి వచ్చింది. బీహార్‌కు చెందిన ఈ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ తన మొదటి రెండు టీ20 మ్యాచ్‌ల్లో భయం లేకుండా సూపర్ షాట్లు ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ, మంచి స్టార్ట్ దొరికినా దాన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌గా మార్చడంలో ఫెయిల్ అయ్యాడు. అయినా సరే, ఈ నాలుగో టీ20లో కూడా వైభవ్‌కు మరో ఛాన్స్ ఇస్తారని టాక్. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తన టాప్ ఆర్డర్లో కొన్ని ప్రయోగాలు చేయవచ్చు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో పడింది. మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌కు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమై కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఫలితంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు అత్యంత అవమానకరమైన అతిపెద్ద ఓటముల్లో ఒకటిగా నమోదైంది. ఈ పేలవ ప్రదర్శనతో జట్టు ఎంపిక విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐర్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టు ఆటతీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లోనూ అదే విధమైన ఓటములు మార్కెట్ అవుతున్నాయి. మేనేజ్మెంట్ రెండో టీ20 మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను పక్కన పెట్టి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చింది. అయితే వైభవ్ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక తీవ్రంగా నిరాశపరిచాడు. ఇదిలా ఉండగా జట్టు వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న తిలక్ వర్మ కూడా వరుసగా ఫామ్ కోల్పోయి ఘోర వైఫల్యాలను చవిచూస్తున్నాడు. మూడో మ్యాచ్‌లో తిలక్ వర్మ 11 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ ఘోర పరాజయాల నేపథ్యంలో భారత జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ చేసిన విశ్లేషణ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. తిలక్ వర్మ ఇటీవలి మ్యాచ్‌ల్లో వరుసగా నిరాశపరుస్తున్న కారణంగా సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే సంజూను మిడిల్ ఆర్డర్లో కాకుండా ఓపెనర్‌గా లేదా టాప్-3 స్థానంలో మాత్రమే ఆడించాలని స్పష్టం చేశారు. బలవంతంగా మిడిల్ ఆర్డర్లో మార్పులు చేసి ఉన్న బ్యాటింగ్ కాంబినేషన్‌ను దెబ్బతీయవద్దని టీమ్ మేనేజ్మెంట్ను హెచ్చరించారు. సంజూ శాంసన్ తన సహజ సిద్ధమైన

ఇంటర్నెట్ డెస్క్: మొన్నటివరకు టీ20ల్లో ఏకాఛత్రాధిపత్యం ప్రదర్శించిన టీమ్ఇండియా ఒక్కసారిగా వెనకబడిపోయింది. 2026 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఐదు మ్యాచ్‌లు ఆడిన టీమ్ఇండియా ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. టీ20ల్లో భారత్‌కు ఈ పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. చిన్న జట్టు ఐర్లాండ్ చేతిలో షాక్ తిన్న శ్రేయస్ సేన.. ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లోనూ (ENG vs IND) ఘోర ప్రదర్శన చేస్తోంది. దీంతో ఇప్పుడు భారత జట్టు వరుసగా రెండో సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. మూడో టీ20లో 125 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లిష్ జట్టు 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే టీమ్ఇండియా సిరీస్ 2-2తో సమం చేయగలదు. గురువారం బ్రిస్టల్‌లో నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశముంది. సంజు శాంసన్ (Sanju Samson) స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్ ఇవ్వొచ్చు. అయితే, శాంసన్ ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. వరుసగా అతడిని రెండు మ్యాచ్‌లకు దూరం పెట్టడంపై అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. మూడో టీ20లో ఓటమిపాలైన తర్వాత టీమ్ఇండియా ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది టీమ్ బస్సు వైపు వెళ్తుండగా కొంతమంది అభిమానులు ‘మాకు సంజు కావాలి’ అని నినాదాలు చేశారు. మరో మ్యాచ్‌లో అతడిని ఆడించకపోతే టీమ్ మేనేజ్మెంట్పై విమర్శలు మరింత తీవ్రమవడం ఖాయం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 13, 24*, 3 స్కోర్లు చేసిన తిలక్ వర్మపై వేటు వేసి సంజును తుది జట్టులోకి తీసుకోని మూడో స్థానంలో ఆడించొచ్చు. రెండో టీ20తో అరంగేట్రం చేసిన టీనేజీ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi)పై మేనేజ్‌మెంట్‌తోపాటు అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, వైభవ్ బ్యాట్ నుంచి ఇంకా మెరుపులు రాలేదు. రెండు మ్యాచుల్లో కలిపి 27 రన్స్ మాత్రమే చేశాడు. నాలుగో

IND vs ENG : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా గురువారం బ్రిస్టల్‌లో ఇంగ్లండ్‌తో జరగబోయే నాల్గో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. భారత్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం, ఇందులో గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.. లేదంటే సిరీస్ ఇంగ్లండ్ పరం అవుతుంది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను గత రెండు మ్యాచ్‌ల్లో పక్కన పెట్టి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. వైభవ్ ప్రదర్శన మరీ అధ్వాన్నంగా లేకపోయినా, జట్టు ఓడిపోతుండటంతో సంజూను తిరిగి జట్టులోకి తీసుకురావాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సంజూ రీఎంట్రీని తోసిపుచ్చలేదు. సంజూ శాంసన్ కెరీర్ గత కొన్ని నెలలుగా తీవ్ర అస్థిరత్వంతో సాగుతోంది. జట్టులో రాణించినప్పటికీ అతనికి స్థానం దక్కకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడో టీ20లో భారత్ 125 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత, ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం బయట అభిమానులు వీ వాంట్ సంజూ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టినప్పుడు కూడా ఇలాగే విమర్శలు రాగా, ఇప్పుడు ప్రపంచకప్ హీరో సంజూను బెంచ్‌కే పరిమితం చేయడంపై పబ్లిక్ నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనివల్ల కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వ్యూహాలు ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై ఒత్తిడి పెంచకుండా, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే, ఓపెనింగ్ జోడీని మార్చకుండా సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకురావాలంటే మిడిల్ ఆర్డర్లో మార్పులు చేయక తప్పదు. వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ స్థానం సురక్షితంగానే ఉన్నట్లు కనిపిస్తుండటంతో, వైఫల్యాలతో

సంజూ శాంసన్‌ను తప్పించడం పై ఎట్టకేలకు స్పందించిన హెడ్ కోచ్ గంభీర్ దాని గురించి సంజూకు ఎప్పుడో స్పష్టత ఇచ్చా మీకు చెప్పాల్సిన అవసరం లేదు Gautam Gambhir : ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 202 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 76 పరుగులకే టీమ్ఇండియా కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ నేపథ్యంలో భారత జట్టు పై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రపంచ కప్ హీరో సంజూ శాంసన్‌ను పక్కన బెట్టడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శల జడివాన కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో సంజూ శాంసన్‌ను భారత జట్టు మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అంతేకాదండోయ్..జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దీనిపై ఎట్టకేలకు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) స్పందించాడు. మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఎందుకు జట్టులోంచి తీసివేశామనే విషయంపై తనకు, సంజూ శాంసన్‌కు మధ్య పూర్తి స్పష్టత ఉందన్నాడు. అయితే.. ఆ విషయాలను బయటపెట్టదలచుకోలేదన్నాడు. 'ఎందుకు తీసివేశాం అన్న దానిపైనే నా వైపు నుంచి సంజూ శాంసన్‌కు స్పష్టత ఇచ్చాను. హెడ్ కోచ్, ప్లేయర్‌కు మధ్య జరిగిన సంబాషణ అది. ఆ సంభాషణ వివరాలను బయట పెట్టాలని అనుకోవడం లేదు. 'అని గంభీర్ చెప్పాడు. “What Sanju Samson has done for India at World Cup is phenomenal; no hard rule says he can’t return in this series.” Gautam Gambhir delivers explosive press conference after Trent Bridge defeat #ENGvIND —

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ సీనియర్ జట్టులోకి దూసుకొచ్చిన వైభవ్ సూర్యవంశీ ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టులో వైభవ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అతను బ్యాట్‌తో నిరాశపరిచాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిన వైభవ్, నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ కేవలం 5 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఈ చిన్న ఇన్నింగ్స్‌లోనే రెండు అద్భుతమైన సిక్సర్లు బాది తనలోని హిట్టింగ్ టాలెంట్‌ను చూపించాడు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంలో వైభవ్‌ను జట్టులోకి తీసుకోవడంతో, అతని వరుస వైఫల్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇంత చిన్న వయసులోనే అతడిని అంతర్జాతీయ క్రికెట్లోకి తీసుకురావడం తొందరపాటేనా అని కొందరు మాజీలు ప్రశ్నిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయినప్పటికీ, అతడిని ప్రస్తుతానికి ప్లేయింగ్ ఎలెవన్ నుంచి దూరం చేసే అవకాశం లేదని తెలుస్తోంది. టీమిండియా మేనేజ్మెంట్ ఈ యంగ్ సంచలనానికి మరికొన్ని అవకాశాలు ఇచ్చి పూర్తిగా పరీక్షించాలని భావిస్తోంది. వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ శైలి గురించి అందరికీ తెలిసిందే కాబట్టి, క్రీజులో ఉన్న కొద్దిసేపైనా అతను ప్రత్యర్థి బౌలర్లలో వణుకు పుట్టించగలడనే నమ్మకం జట్టు వర్గాల్లో ఉంది. దీనివల్ల సంజూ శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు. అయితే, వరుసగా ఫ్లాప్ అవుతున్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్‌ను ఫిట్ చేసే విషయమై మేనేజ్మెంట్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. అతను సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి

Why India Losing Matches: ఒకప్పుడు టీ20 క్రికెట్లో ఓటమి ఎరుగని రారాజులా వెలిగిన భారత జట్టు, ఇప్పుడు వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతోంది. రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మన తోపులు, ఇప్పుడు ఒకే ఒక్క విజయం కోసం తలకిందులుగా తపస్సు చేయాల్సి వస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోవడానికి దారితీసిన ఆ మూడు బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గడిచిన రెండేళ్లలో టీమిండియా సాధించిన విజయాల్లో బ్యాటింగ్ విభాగమే కీలక పాత్ర పోషించింది. కానీ ప్రస్తుత విదేశీ పర్యటనలలో మన బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. క్రీజులోకి రావడం, పెవిలియన్‌కు క్యూ కట్టడం అన్నట్లుగా సాగుతోంది వారి ఆటతీరు. ఓపెనర్లు ఇద్దరూ జట్టుకు కనీస ఆరంభాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవడానికే ఇబ్బంది పడుతున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బాధ్యతారహితమైన షాట్లతో వికెట్లను పారేసుకుంటున్నారు. అందరూ కలిసికట్టుగా విఫలమవడంతో జట్టు భారీ స్కోర్లు సాధించలేక కుప్పకూలుతోంది. భారతీయ లీగ్ క్రికెట్లో కోల్‌కతా జట్టును విజేతగా నిలిపి, అద్భుతమైన కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయస్ అయ్యర్.. జాతీయ జట్టుకు నాయకత్వం వహించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. అతని సారథ్యంలోనే భారత్ ఈ వరుస నాలుగు పరాజయాలను మూటగట్టుకుంది. మైదానంలో సరైన వ్యూహాలు రచించలేకపోవడమే కాకుండా, కనీసం బ్యాట్‌తోనైనా జట్టును ముందుండి నడిపించలేకపోతున్నాడు. ఒకవైపు కెప్టెన్సీ ఒత్తిడి, మరోవైపు పేలవమైన ఫామ్ కారణంగా కనీసం అసలు అతనికి టీ20 జట్టులో చోటు అవసరమా? అనేంతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా వరుస ఓటములకు కేవలం ఆటతీరు మాత్రమే కాదు, జట్టు అంతర్గత వాతావరణం కూడా సరిగ్గా లేకపోవడమే కారణమని స్పష్టమవుతోంది. ప్రపంచకప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాడిని అకస్మాత్తుగా జట్టుకు దూరం చేయడం ఎవరికీ అర్థం కావడం లేదు. మరోవైపు సిరీస్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచిన సంజూ శాంసన్‌కు

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా మూడు మ్యాచుల్లో విఫలం కావడంతో సంజు శాంసన్‌ను టీమ్ఇండియా (Team India Lost) మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. జింబాబ్వే సిరీస్‌కూ ఎంపిక చేయకపోవడం విమర్శలకు దారితీసింది. ప్రపంచ కప్‌లో హీరో అయిన సంజును అలా ఎలా పక్కన పెడతారంటూ నెట్టింట కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Head Coach Gautam Ganbhir) మౌనం వీడాడు. సంజును తప్పించడానికి గల కారణాలను వెల్లడించాడు. ఇంగ్లాండ్ చేతిలో మూడో టీ20లోనూ భారత్ ఓడిన అనంతరం గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘జట్టులో నుంచి ఎందుకు తప్పించామనే విషయంపై సంజు శాంసన్ (Sanju Samson)కు నా వైపు నుంచి స్పష్టత ఇచ్చాను. అది కేవలం ప్రధాన కోచ్, ప్లేయర్‌కు మధ్య జరిగిన సంభాషణ. ఆ వివరాలను బయటకు వెల్లడించలేను. సంజు వ్యవహారంలో మేం క్లారిటీగానే ఉన్నాం. భారత జట్టుకు అతడు చేసిన దేనినీ మరిచిపోలేం. అయితే, ఏదైనా సిరీస్‌కు ఎంపిక చేసేటప్పుడు సదరు ప్లేయర్ ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. సంజు మళ్లీ పుంజుకుని ఇదే సిరీస్‌లో పునరాగమనం చేయొచ్చు. వరల్డ్ కప్ ముందు అతడు ఇబ్బంది పడిన సందర్భాలనూ చూశాం. కానీ, ఆ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు’’ అని గంభీర్ (Gautam Gambhir) తెలిపాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో జట్టు కూర్పు సమస్య కాదు. ఫలితమే ముఖ్యం. ఫైనల్ XIలో ఎవరు ఉన్నారనేదానికంటే మనం విజయం సాధించామా? లేదా? అనేది చూడాలి. టీమ్ఇండియా కోసం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ జట్టులో స్థానం దక్కుతుంది. అయితే, ఐర్లాండ్తోపాటు ఇంగ్లాండ్‌లో (India vs England) పరిస్థితులను అలవర్చుకోవడంలో ఆటగాళ్లు ఇబ్బంది పడటం చూశాం. ఇంకా మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. వరుసగా మేం నాలుగు మ్యాచుల్లో ఓడిపోవడానికి ఇవే కారణాలుగా భావిస్తున్నాం’’ అని గంభీర్ తెలిపాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఘోర పరాజయం పాలైన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి మీడియా సమావేశంలో కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 76 పరుగులకే కుప్పకూలడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా 2026 టీ20 ప్రపంచకప్‌లో హీరోగా నిలిచిన సంజూ శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై పెను దుమారం రేగింది. ఈ విషయంపై గంభీర్ స్పందిస్తూ, సంజూతో తనకు పూర్తి స్పష్టత ఉందని, అయితే వారి మధ్య జరిగిన సంభాషణను బయటపెట్టలేనని స్పష్టం చేశాడు.ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ విఫలమైన సంజూ శాంసన్ స్థానంలో 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. అయితే, వైభవ్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. అయినప్పటికీ, సంజూకు జట్టులో అతని పాత్రపై పూర్తి స్పష్టత ఇచ్చానని గంభీర్ భరోసా ఇచ్చాడు.మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ.. "సంజూ శాంసన్‌కు ఎలాంటి స్పష్టత కావాలో, అది నా వైపు నుంచి ఇచ్చాను. అది పూర్తిగా హెడ్ కోచ్, ఆటగాడి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ. ఆ విషయం బయటకు రాదు" అని ఖరాఖండిగా తెలిపాడు. "సంజూ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది. అతను భారత్ కోసం అద్భుతాలు చేశాడు. కానీ కొన్నిసార్లు ఆటగాడి ప్రస్తుత ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లోనే అతను తిరిగి జట్టులోకి రాలేడనే కఠిన నిబంధన ఏమీ లేదు" అని

స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 జట్టు వరుస పరాభవాలను ఎదుర్కొంటుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. అయితే స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు మౌనం వీడాడు. జట్టు ఎంపికపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మూడో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సంజు శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడానికే ముందే అతడితో నేను చర్చించాను. అతడి ప్రశ్నలు క్లారిటీ ఇచ్చాను. అయితే జట్టు ఎంపిక అనేది పూర్తిగా ఆటగాడు, ప్రధాన కోచ్ మధ్య జరిగే వ్యక్తిగత విషయం. దాన్ని బయటకు చెప్పడం సరైంది కాదు. భారత్ కోసం సంజు చేసిన సేవలు అద్భుతమైనవి. అయితే కొన్ని సందర్భాల్లో ప్లేయర్ ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అతడు ఈ సిరీస్‌లో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలను కూడా పూర్తిగా కొట్టిపారేయలేం’ అని గంభీర్ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వ్యక్తుల కంటే జట్టు సమతుల్యతకే ప్రాధాన్యం ఉంటుందని గంభీర్ వివరించాడు. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌లో వైభవ్ సూర్యవంశీ సరైన కాంబినేషన్ అవుతాడనే నమ్మకంతో అతడిని ఎంపిక చేశామని తెలిపాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలే ముఖ్యం. జట్టుకు విజయాన్ని అందించే ఉత్తమ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో, అదే ఆడిస్తాం. ప్రతి ప్లేయర్ తన ప్రదర్శనతోనే భారత్‌కు ఆడే అవకాశాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడ ఎవరి స్థానం శాశ్వతం కాదు. అయితే మేం పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయాం. అందుకే అన్నీ ఓడిపోవాల్సి వచ్చింది’ అని గంభీర్ తెలిపాడు

Sanju Samson : భారత క్రికెట్ అభిమానులను ప్రస్తుతం ఒకే ఒక ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ టీమిండియాకు ఇక శాశ్వతంగా దూరమైపోయాడా? ఐసీసీ వరల్డ్ కప్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది, భారతదేశాన్ని విశ్వవిజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన శాంసన్‌ను.. ఇప్పుడు అకస్మాత్తుగా జింబాబ్వే పర్యటనకు దూరం పెట్టడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఈ ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సంజూ శాంసన్ భవిష్యత్తుపై ఇలాంటి అనుమానాలు రావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఇటీవల జరిగిన యూకే పర్యటనలో సంజూ ఘోరంగా విఫలమయ్యాడు. అక్కడ ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆయన కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా మొదట ఆయనను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించారు. ఆ తర్వాత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో అవకాశం కల్పించడంతో, సంజూ శాంసన్ ఏకంగా స్క్వాడ్ నుంచే డ్రాప్ అయ్యాడు. దీంతో ఆయన కెరీర్ ముగిసిపోయిందంటూ పుకార్లు షురూ అయ్యాయి. అయితే, సంజూ శాంసన్ భారత జట్టుకు దూరం కాలేదని, జింబాబ్వే సిరీస్‌కు దూరం పెట్టడం వెనుక ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. జింబాబ్వే పర్యటనలో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి పరీక్షించాలని సెలెక్టర్లు భావించారు. ఒకవేళ ఈ పర్యటనకు సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినా కూడా, సీనియర్ అయిన అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టంగా మారేది. అందుకే యువకులను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సంజూ శాంసన్ అభిమానులకు ఉపశమనం కలిగించే మరో పెద్ద అప్డేట్ కూడా ఉంది. కొన్ని వారాల వ్యవధిలోనే ఆయన మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించబోతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్

టీ20 ప్రపంచకప్2026ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శాంసన్‌ను పక్కన పెట్టడంపై టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. టీ20 ప్రపంచకప్2026ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శాంసన్‌ను పక్కన పెట్టడంపై టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ మేరకు రహానే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'ఇటీవలి టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన హీరోని, జింబాబ్వే పర్యటనకు దూరం పెట్టడం నాకు చాలా వింతగా అనిపించింది. దీనిపై సెలెక్టర్లు శాంసన్‌తో చర్చించి ఉంటారని, సరైన సమాచారం ఇచ్చి ఉంటారని ఆశిస్తున్నాను. అతను త్వరలోనే మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేస్తాడనే నమ్మకం ఉంది' అని రహానే తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఆటగాళ్లకు, సెలెక్షన్ కమిటీకి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలనే ఉద్దేశంతో రహానే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రాణించి, ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్‌కు తదుపరి సిరీస్‌లోనే చోటు దక్కకపోవడంపై అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో సీనియర్లను పక్కన పెడుతున్నారా? లేక శాంసన్‌కు విశ్రాంతినిచ్చారా? అనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా, ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే రోజుల్లో శాంసన్ మళ్లీ జట్టులోకి వచ్చి.. సత్తా చాటుతాడని రహానేతో పాటు కోట్లాది మంది అభిమానులు బలంగా ఆశిస్తున్నారు. సంజును పక్కన పెట్టి మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: మహ్మద్ కైఫ్

జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో వికెట్‌కీపర్-బ్యాటర్ సంజూ సామ్సన్‌కు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడిని అకస్మాత్తుగా పక్కన పెట్టడంపై టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకునే ముందు సంజూ సామ్సన్తో కనీసం మాట్లాడి ఉంటారని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన రహానే, “సంజూ శాంసన్‌తో ఈ విషయంపై కనీసం మాట్లాడి ఉంటారని ఆశిస్తున్నాను. ఇటీవల టీ20 వరల్డ్ కప్ హీరోగా ఉన్న ప్లేయర్‌ని జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అతడు త్వరలోనే మళ్లీ భారత జట్టులోకి రావాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నాడు. రహానే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా సంజూను జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని అంటున్నారు. గత కొంతకాలంగా అవకాశాలు దక్కినప్పుడల్లా మంచి ప్రదర్శన చేసిన సంజూకు ఈ నిర్ణయం నిరాశ కలిగించిందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా భారత సెలెక్టర్లు, జూలై 6న జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. శ్రేయాస్ అయ్యర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కాగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ అశోక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, యశ్ ఠాకూర్లకు తొలిసారి జాతీయ జట్టులో అవకాశం కల్పించారు. అలాగే ఇంగ్లాండ్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో భారత్ మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్ జూలై 23న, రెండో మ్యాచ్ జూలై 25న, మూడో మ్యాచ్ జూలై 26న హరారే వేదికగా జరుగనున్నాయి. మరిన్ని