© 2026 nimisham.in

యూకే పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షార్పణం కాగా, తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలై సిరీస్‌ను ఇంగ్లండ్‌కు అప్పగించింది. ఐపీఎల్లో కెప్టెన్‌గా విజయవంతమైన శ్రేయస్ అయ్యర్.. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. తొలి విజయం కోసం అతడు అతృతగా ఎదురు చూస్తున్నాడు. అతడి సారథ్యంలో భారత్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓటమి పాలై రెండు సిరీస్‌లను కోల్పోయింది. ఇక యూకే టూర్లో భారత బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమైంది. కెప్టెన్ శ్రేయస్, అభిషేక్ శర్మ మినహా మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు. టీ20 ప్రపంచకప్-2026 హీరో సంజూ శాంసన్ కూడా ఈ పర్యటనలో నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం కావడంతో సంజూను తుది జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశమిచ్చారు. కానీ భారీ అంచనాలతో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలు పెట్టిన వైభవ్.. తన మొదటి మూడు మ్యాచ్‌లలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మూడు మ్యాచ్‌లు కలిపి కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. కిషన్‌కు ఏమైంది? మరోవైపు వరల్డ్ నంబర్ టీ20 బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన కిషన్.. ఆ ఫామ్‌ను యూకే పర్యటనలో మాత్రం కొనసాగించలేకపోయాడు. ఒకేరకమైన బంతులకు పదే పదే అవుట్ అవుతూ నిరాశపరుస్తున్నాడు. గత 6 ఇన్నింగ్స్‌ల్లో ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని యావరేజ్ 13.2 కాగా, స్ట్రైక్ రేట్ 108.2 మాత్రమే. సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీల గురించిన చర్చల నడుమ.. కిషన్ వైఫల్యాలు అంతగా హైలెట్ కాలేదు. కానీ
Jul 10 2026 6:10 PM | Updated on Jul 10 2026 6:22 PM
యూకే పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షార్పణం కాగా, తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలై సిరీస్‌ను ఇంగ్లండ్‌కు అప్పగించింది.
ఐపీఎల్లో కెప్టెన్‌గా విజయవంతమైన శ్రేయస్ అయ్యర్.. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. తొలి విజయం కోసం అతడు అతృతగా ఎదురు చూస్తున్నాడు. అతడి సారథ్యంలో భారత్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓటమి పాలై రెండు సిరీస్‌లను కోల్పోయింది.
ఇక యూకే టూర్లో భారత బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమైంది. కెప్టెన్ శ్రేయస్, అభిషేక్ శర్మ మినహా మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు. టీ20 ప్రపంచకప్-2026 హీరో సంజూ శాంసన్ కూడా ఈ పర్యటనలో నిరాశపరిచాడు.
మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం కావడంతో సంజూను తుది జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశమిచ్చారు. కానీ భారీ అంచనాలతో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలు పెట్టిన వైభవ్.. తన మొదటి మూడు మ్యాచ్‌లలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మూడు మ్యాచ్‌లు కలిపి కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు.
కిషన్‌కు ఏమైంది? మరోవైపు వరల్డ్ నంబర్ టీ20 బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన కిషన్.. ఆ ఫామ్‌ను యూకే పర్యటనలో మాత్రం కొనసాగించలేకపోయాడు. ఒకేరకమైన బంతులకు పదే పదే అవుట్ అవుతూ నిరాశపరుస్తున్నాడు.
గత 6 ఇన్నింగ్స్‌ల్లో ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని యావరేజ్ 13.2 కాగా, స్ట్రైక్ రేట్ 108.2 మాత్రమే. సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీల గురించిన చర్చల నడుమ.. కిషన్ వైఫల్యాలు అంతగా హైలెట్ కాలేదు.
కానీ కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి తన చెత్త ప్రదర్శనతో కిషన్ భారత ఓటమికి ఓ కారణమయ్యాడు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. తన స్లో బ్యాటింగ్‌తో మాజీ క్రికెటర్లకు టార్గెట్ అవుతున్నాడు.
కాగా భారత్‌లో ఫ్లాట్ పిచ్‌లకు అలవాటు పడడం కారణంగానే విదేశీ పరిస్థితులపై మన బ్యాటర్ల రాణించలేకపోతున్నారన్న విమర్శలు వస్తుస్తున్నాయి. ఇంగ్లండ్ పిచ్‌లపై ఉండే అదనపు బౌన్స్, మూవ్‌మెంట్‌ను అంచనా వేయడంలో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు.
తొలి టీ20 నుంచే షార్ట్ పిచ్ బంతులకు వికెట్లు సమర్పించుకుంటున్నారు. కనీసం చివరి టీ20లోనైనా గెలిచి పరువు కాపాడుకుంటారో లేదో చూడాలి. ఐదో టీ20 శనివారం సౌతాంప్టన్ వేదికగా జరగనుంది.
సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
డిఫరెంట్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ నిషా అగర్వాల్..ఫోటోలు
నాగబంధంలో అనసూయ.. అరుదైన స్టిల్స్ చూశారా? (ఫోటోలు)
హాఫ్ శారీలో లెనిన్ భామ భాగ్యశ్రీ బోర్సే అందాలు.. ఫోటోలు
సిస్టర్ పెళ్లిలో ఖుషీ కపూర్ స్టైలిష్ అవుట్‌ఫిట్.. ఫోటోలు
Nizami Food Festival: 51 రకాల నిజామి వంటలతో అన్ లిమిటెడ్ బఫె
జీతం 26 వేలు ఇవ్వాల్సిందే.. రోడ్డెక్కిన అంగన్వాడీలు
దమ్ముంటే టచ్ చేయండి ... కొడాలి నాని పై కేసు, అంబటి రాంబాబు స్ట్రాంగ్ రియాక్షన్
వరల్డ్ కప్ హీరోని పక్కన పెడతారా? బుడ్జోడా వెళ్లి IPL ఆడుకో