
మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఈనాడు, అమరావతి: ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా గురువారం నుంచి అక్టోబర్‌ 17 వరకు నెల రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్‌’ పేరుతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. అన్ని పీహెచ్‌సీల వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు వైద్యసేవలు అందించడంతోపాటు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తామన్నారు. శిబిరాలకు హాజరయ్యే వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. 104 సంచార వైద్యశాలల ద్వారా నిర్వహించే పరీక్షలతో ఈ శిబిరాలు అనుసంధానం చేస్తామని తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




