
‘నా బిడ్డని కాపాడు.. నీ మొక్కు చెల్లిస్తా.. నీకు సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు.. నా ప్రాణాలు తప్ప..’ అంటూ ఓ భక్తురాలు తన బిడ్డ క్షేమం కోసం అమ్మవారిని వేడుకుని ప్రాణం అర్పించింది.
‘నా బిడ్డని కాపాడు.. నీ మొక్కు చెల్లిస్తా.. నీకు సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు.. నా ప్రాణాలు తప్ప..’ అంటూ ఓ భక్తురాలు తన బిడ్డ క్షేమం కోసం అమ్మవారిని వేడుకుని ప్రాణం అర్పించింది. మరి ఆ అమ్మ అనుగ్రహించి బిడ్డని కాపాడిందా? లేదా? అనేది తెలియాలంటే ‘మహాశక్తి’ సినిమా చూడాలంటోంది ఆ చిత్రబృందం. అగ్ర కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాని సుందర్‌ సి తెరకెక్కిస్తున్నారు. ఈషారీ కే గణ్‌శ్‌ నిర్మిస్తున్నారు. రెజీనా, ఊర్వశీ, దునియా విజయ్, యోగిబాబు, సునీల్‌ తదితరులు కీలక పాత్రాధారులు. ‘ది రైజ్‌ ఆఫ్‌ మహాశక్తి’ పేరుతో ఈ సినిమా టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ‘శత్రువులొచ్చేశారు.. మనం ప్రాణం అడ్డుపెట్టైనా సరే రాకుమారుణ్ని కాపాడుకోవాలి..’ అంటూ ప్రారంభమైన టీజర్లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో రెజీనా కనిపించిన తీరు.. నయనతార ఎంట్రీ, ‘మమ్మల్ని కాపాడాల్సిన నువ్వే ఇలా వదిలేసి వెళ్తావా’, ‘ఆ రోజు నీ విలువ తెలుసుకోలేకపోయాం.. ఇప్పుడేనమ్మా నీ విలువ తెలుస్తుంది.. కాపాడమ్మా’ లాంటి సంభాషణలతో ఆసక్తిగా సాగిందీ టీజర్‌. డివోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మూకుత్తి అమ్మన్‌’(అమ్మోరు తల్లి)కి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. దీపావళి పండగ సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో నవంబరు 6న విడుదల కానుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




