
భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, అనుబంధం పెరగాలంటే రోజులో కొంత సమయం ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా నిద్రకు ముందు పడక గదిలో భార్యభర్తలు ఒకరినొకరు కళ్లల్లో చూస్తూ.. ప్రశాంతంగా మాట్లాడుకునే సమయాన్ని ‘పిల్లో టాక్’ అంటారు. ఈ అలవాటు వల్ల దంపతుల మధ్య భావోద్వేగ అనుబంధం పెరగడంతో పాటు అపార్థాలు, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అసలు పిల్లో టాక్ అంటే ఏమిటి? దంపతుల బంధానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? తెలుసుకుందాం.



