Stock Split: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆగ్రో ఉత్పత్తుల రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ న్యాచురైట్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది. ఈ కంపెనీ షేర్లు 1:2 రేషియోలో స్ప్లిట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు రికార్డ్ తేదీని సెప్టెంబర్ 25, 2026గా నిర్ణయించామని వెల్లడించింది. ఆలోపు ఈ కంపెనీలో 1 షేరు కొంటే 2 షేర్లు, 100 షేర్లు కొంటే 200 షేర్లు అందనున్నాయి. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.




