
ఆన్లైన్ షాపింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ డేట్స్ వచ్చేశాయి. ఈ మెగా సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానున్నట్లు ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్ తమ ప్లాట్ఫామ్లో ప్రత్యేక మైక్రోసైట్‌ను లైవ్ చేస్తూ, బ్యాంక్ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల వివరాలను వెల్లడించింది. సాధారణ యూజర్ల కంటే ఒక రోజు ముందుగానే ప్లస్ మెంబర్స్‌కు ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ , ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులు, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఈ 24 గంటల ఎర్లీ యాక్సెస్ లభిస్తుంది. ప్రధాన సేల్ ప్రారంభం కాకముందే పరిమిత స్టాక్ ఉండే హాట్ డీల్స్‌ను దక్కించుకునే అవకాశం వీరికి దక్కుతుంది.