
సందీప్ కిషన్ హీరోగా, సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘సిగ్మా’. అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘బాహుబలి’, ‘పుష్ప’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు కూడా తొలిరోజే తెలుగులో ఫ్లాప్ టాక్ ప్రచారం చేశారని, మన తెలుగు వాళ్ల ప్రతిభను మనమే ప్రోత్సహించడంలో ఎందుకు ఆలోచిస్తున్నామని ప్రశ్నించారు. తమిళంలో తనను హీరోగా అంగీకరించారని, జేసన్ సంజయ్ ఎంతో నిబద్ధతతో 63 రోజుల్లోనే సినిమాని పూర్తి చేశారని సందీప్ తెలిపారు.




