
Stock Split: ఎనర్జీ సెక్టార్లోని స్మాల్ క్యాప్ కేటగిరి కంపెనీ మిడ్ వెస్ట్ ఎనర్జీ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థ బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలని నిర్ణయించారు. అంటే 1 షేరు కొంటే 10 షేర్లు, 10 షేర్లు కొంటే 100 షేర్లుగా మారనున్నాయి. రికార్డు డేట్ సెప్టెంబర్ 25గా నిర్ణయించారు. అంతే కాదు ఈ స్టాక్ 5 ఏళ్లలోనే 20 వేల శాతానికిపైగా పెరిగి కాసుల వర్షం కురిపించింది. లక్ష రూపాయలను ఏకంగా రూ.2 కోట్లకు పైగా చేసింది. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.





