
ప్రచారంలో ఉన్న ఒక పౌరాణిక కథను అనుసరించి.. ఒకసారి బ్రహ్మదేవుడు తన సృష్టిని చూసుకుంటూ ఆనందంగా విహరిస్తున్నాడు. అప్పుడాయనకు ఒక చీమ కనిపించింది. అది ఎంతో శ్రద్ధగా తన ఆహారాన్ని మోసుకుంటూ వెళ్తోంది. ఆ పిపీలకం ఎలా ప్రతిస్పందిస్తుందో చూద్దామని బ్రహ్మదేవుడు- ‘నీ చిన్ని పొట్ట నిండటానికి ఇంత శ్రమించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ పట్టుదలతో పనిచేస్తున్నావు’ అన్నాడు నవ్వుతూ. ‘స్వామీ! నా ఆయువు కూడా చిన్నదే. కానీ ఈ చిన్న జీవితంలో నా కర్తవ్యాన్ని పాటించడం ధర్మం కదా!’ అంది. ఆ జవాబు విని సంతోషించిన బ్రహ్మదేవుడు ‘అవును.. కర్తవ్య నిర్వహణ చాలా ముఖ్యమైంది. ప్రతి జీవిలోనూ దైవాంశ ఉంది. నువ్వు నీ కర్మఫలానుసారం ప్రయాణిస్తూ, జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నావు’ అన్నాడు. చీమ తన అల్పశక్తితోనే ఇతర జీవులకూ సాయం చేసేది. కర్తవ్యాన్ని ధర్మనిష్ఠగా భావించి, నిరంతరం శ్రమించే చీమ మనకు ఆదర్శం. నలుసంత ఉన్న చీమే అలా ఉన్నప్పుడు.. విచక్షణాజ్ఞానం ఉన్న మనమెంత ఉన్నతంగా జీవించాలో, ఆధ్యాత్మికతను అలవరచుకోవాలో తెలియజేస్తుందీ కథనం. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





