
వాహనం రోడ్డుపైకి వెళ్లడానికి ముందు అది నిజంగా ఫిట్‌గా ఉందో లేదో తేల్చాల్సిన వ్యవస్థలోనే భారీ లొసుగులు బయటపడ్డాయి. యంత్రాలతో శాస్త్రీయంగా పరీక్షించాల్సిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు(ఏటీఎస్) అక్రమాలకు నిలయాలుగా మారాయి. ఇదివరకు వాహనాన్ని తనిఖీ చేసి చిన్నచిన్న లోపాలున్నా లంచం తీసుకుని పలువురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు(ఎంవీఐ) ఎఫ్‌సీ ఇచ్చేవారు.





