
భువనగిరి: భువనగిరి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. పట్టణంలోని ఇందిరా నగర్‌లో జరిగిన గణేష్ పూజలో జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ భాస్కరరావు పాల్గొన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో పూజలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని కృపతో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు పడి పాడిపంటలతో అభివృద్ధి సాధించాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పూజిత, జాలిగం విగ్నేశ్వర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బర్రె జహంగీర్ నిర్వాహకులు సిరిపంగ సుభాష్, బండారు రవి వర్ధన్, కోట రాము తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





