
న్యూస్‌టుడే, విజయవాడ(విద్యాధరపురం) : విజయవాడకు చెందిన డూండీ గణేశ్‌ సేవా సమితి ఆధ్వర్యంలో లేబరుకాలనీ మైదానంలో 72 అడుగుల పర్యావరణహిత ‘శ్రీపంచముఖ వరసిద్ధి మహాగణపతి’ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన వినాయకుడి ఆగమన కార్యక్రమంలో మంత్రి సవిత హాజరై, మహిళలతో కలిసి కోలాటం ఆడారు. హే సిరి.. ఏ మండపానికి వెళదాం! ‘నా పుట్టినరోజు వచ్చిందంటే చాలు.. ఏ సందులో చూసినా నా మండపాలే. ఆ పూజలు పునస్కారాలు చేయించుకోవడం భలే ఉంటుంది. నా చెవుల్లో భక్తులు కోరికలు చెప్పగానే తథాస్తు అనాలనే ఉంటుంది. కానీ ఈ మధ్య ఎక్కడ చూసినా డీజే సౌండ్లు, అర్థం లేని పాటలు. బొత్తిగా వెళ్లాలనిపించడం లేదు. వాటన్నింటికీ భిన్నంగా ఏ మండపమైనా ఉంటే వెళదామని ఈ సెర్చింగ్‌.. హే సిరి.. నా దగ్గర్లో ప్రశాంతమైన మండపం ఏదైనా ఉందా?’ టెక్‌ వినాయక్‌’ ఈనాడు, విశాఖపట్నం; న్యూస్‌టుడే, రామ్‌నగర్‌ : యాపిల్‌ ల్యాప్‌టాప్‌ పట్టుకుని బిజీగా వర్క్‌ చేసేసుకుంటున్న ఈ వినాయకుడిని విశాఖలోని పెదవాల్తేరు జంక్షన్‌ సమీపంలో ఓ భవన యజమాని చెక్కించారు. ఈ గణపతిని స్థానికులు సాఫ్ట్‌వేర్‌ గణపతి అని పిలుస్తుంటారు. అక్కడా ఉన్నారు.. గణనాథుడి భక్తులు! న్యూస్‌టుడే, అనుమసముద్రంపేట : వినాయకుడికి విదేశాల్లోనూ భక్తులున్నారు. ఆయనపై భక్తితో దేవాలయాలు నిర్మించడమే కాకుండా తమ కరెన్సీలపైనా ఆ గణనాథుడి రూపాలను ముద్రించుకున్నారు. థాయ్‌లాండ్‌లో 2011లో పేరుతో విడుదల చేసిన 10 బాత్‌ల నాణెంపై వినాయకుడి చిత్రం ఉంటుంది. ఇండోనేసియా 1998లో విడుదల చేసిన 20 వేల ఇండోనేసియన్‌ రూపియా నోటుపైనా ఆయన దర్శనమిస్తాడు. ఈ నోటు చెలామణిలో కూడా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేటకు చెందిన ఎం.డి.వాయిజ్‌ వీటిని సేకరించారు. వెలగపండు గణపయ్యా.. పండగే నీదయ్యా! న్యూస్‌టుడే, నంద్యాల గాంధీచౌక్‌: వినాయక చవితి నేపథ్యంలో వైవిధ్య రూపాల్లో స్వామివారు దర్శనమిస్తున్నారు. నంద్యాలలోని సంజీవనగర్‌ రామాలయంలో వెలగపండ్లతో వినాయకుడిని తీర్చిదిద్దారు. ఇందుకు సుమారు 6 వేల పండ్లను ఉపయోగించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





