
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) వినాయక చవితి (Vinayaka Chaturthi) పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంతో విఘ్నాలు తొలగాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలంతా ఆనందం, ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరారు. వేడుకల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, వివిధ జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఏడాది గణేశ్‌ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందిస్తోందని చెప్పారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పండగలైనా.. శుభకార్యాలైనా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి తొలిపూజ చేయడం ఆనవాయితీ. కోరిన కోరికలు తీర్చే గణనాథుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కుతారు. పర్యావరణహిత మట్టి గణపయ్యను పూజిద్దామంటూ ప్రకృతి ప్రేమికులు ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. వినాయకచవితి ఉత్సవాలకు ఖైరతాబాద్‌ (Khairatabad) బడా గణేశుడు సిద్ధమయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)పై మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.





