
విజయనగరం రూరల్‌: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ముందుకు రావాలని పేర్కొన్నారు. మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పర్యావరణ హితమైన వస్తువులతో పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. విగ్రహాల ప్రతిష్ఠ సమయాలలో, విద్యుత్ అలంకరణ సమయంలో, నిమజ్జన సమయాలలో చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిమజ్జనం, ఊరేగింపు కార్యక్రమాలలో పోలీసు అధికారులు సూచించిన భద్రతా నియమాలను పాటించాలన్నారు. వినాయక చవితిని ఆధ్యాత్మిక భావనలతో జరుపుకోవాలని కొండపల్లి పిలుపునిచ్చారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






