
వినాయక చవితి వచ్చిందంటే చాలు... ఊరూవాడా ఎంత సందడో! గణేశుడిని అందంగా తీర్చిదిద్దడానికి అందరూ పోటీపడుతుంటారు. అలా ఏటా విశాఖలోని గాజువాకలో విభిన్న రూపాల్లో విగ్రహాలను భారీగా ఏర్పాటు చేస్తుంటారు. వి నాయక చవితి వచ్చిందంటే చాలు... ఊరూవాడా ఎంత సందడో! గణేశుడిని అందంగా తీర్చిదిద్దడానికి అందరూ పోటీపడుతుంటారు. అలా ఏటా విశాఖలోని గాజువాకలో విభిన్న రూపాల్లో విగ్రహాలను భారీగా ఏర్పాటు చేస్తుంటారు. ఈ సంవత్సరం గాజులతో తీర్చిదిద్దారు. ఈ ఆలోచన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గణేష్‌ భార్య డా.గాయత్రిది కాగా, జ్యోతి మహిళా సేవా సంఘం ఆధ్వర్యంలో కొసిరెడ్డి లక్ష్మి సమన్వయంతో సుమారు 90 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. 89 అడుగుల ఎత్తులో కోటి గాజులతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. గృహిణులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినులు, వ్యాపారస్థులు... ఇలా విభిన్న వర్గాల వారు, వయసుల వారూ భక్తిశ్రద్ధలతో ఈ మహాక్రతువులో పాలు పంచుకున్నారు. మొదట వెదురు బొంగులతో తీర్చిదిద్దిన వినాయకుడి వస్త్రానికి అవసరమైన క్లాత్‌ కటింగ్స్, కుట్టుపని, ఎంబ్రాయిడరీ వంటివన్నీ వీళ్లే చేశారు. ఆపై అలంకరణ పనులు మొదలెట్టారు. గాజుల సైజుల ఎంపిక మొదలుకొని వాటిని వేరు చేసి పైపులకు ఎక్కించడం వరకూ ఎంతో కీలకంగా వ్యవహరించారు. రోజూ 5-10 లక్షల గాజులను దీనికోసం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అవి పగిలి చాలామందికి చేతులు కోసుకుపోయాయి. అయినా వాళ్లు వెనకడుగు వేయలేదు. అంతేనా, వినాయకుడి పూజ జరిపే 21 రోజులు... రోజుకి వంద మంది చొప్పున 500 మంది మొత్తం స్త్రీలే ఉత్సవ నిర్వహణ చేయనున్నారు. రావివలస సురేశ్, విశాఖపట్నం .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings





