
చిన్న మట్టి వినాయకుడైనా, పెద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతిని సిద్ధం చేసినా మన అంతిమ లక్ష్యం... భక్తితో ఆ గణనాథుడిని ప్రార్థించడమే. పసుపు, మట్టి, రాయి, లోహం, చెక్క... ఇలా చేసే పదార్థం వేరయినా, మనసంతా ఒకచోట లగ్నం చేయడమే పూజలోని అంతరార్థం. చిన్న మట్టి వినాయకుడైనా, పెద్ద ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ గణపతిని సిద్ధం చేసినా మన అంతిమ లక్ష్యం... భక్తితో ఆ గణనాథుడిని ప్రార్థించడమే. పసుపు, మట్టి, రాయి, లోహం, చెక్క... ఇలా చేసే పదార్థం వేరయినా, మనసంతా ఒకచోట లగ్నం చేయడమే పూజలోని అంతరార్థం. అందుకే, నవరాత్రులూ గణపయ్యను స్మరించుకుని ఎంతో వైభవంగా నిమజ్జనం చేస్తాం. ఆ భక్తి భావన మాటల్లో వర్ణించలేం కదా... కాబట్టే, దాన్ని ఎప్పుడూ అలానే కొనసాగించాలనుకుంటున్నారు చాలామంది. పూజగదిలో ఓ చిన్న విగ్రహంలా కాదు, నిత్యం కళ్లముందు ఆ గణాధీశుని రూపం కనిపించాలనుకుంటున్నారు. ‘త్రీడీ వాల్‌పేపర్‌’ రూపంలో ఇంట్లో కొలువుదీరుస్తున్నారు. ప్రశాంతమైన ముఖం, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో తులతూగమంటూ ఆశీర్వదించినట్లు ఉండే చేతులతో ఉండే గజాననుని రూపం... నిత్యం మనల్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తుతూనే ఉంటుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది. మరి మీకూ నచ్చాయా ఈ అందమైన ఏకదంతుని వాల్‌పేపర్లు.... అయితే, ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో పెట్టించుకోండి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings





