
బుజ్జి బుజ్జి మట్టి వినాయకుడి బొమ్మల్ని పళ్లెంలో పెట్టి... ఆ వీధిలో వెళ్లేవాళ్లకి చూపిస్తూ మురిసిపోతున్న ఓ బామ్మగారి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. బుజ్జి బుజ్జి మట్టి వినాయకుడి బొమ్మల్ని పళ్లెంలో పెట్టి... ఆ వీధిలో వెళ్లేవాళ్లకి చూపిస్తూ మురిసిపోతున్న ఓ బామ్మగారి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఏంటి వీటి ప్రత్యేకత అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే... గ ణనాథుడిని ప్లాస్టిక్‌ హంగులతో విషపూరితం చేయడం మంచిది కాదు. మట్టి గణపతినే పూజించండి’ అని చెప్పే ఆవిడ పేరు పేరూరి వెంకటలక్ష్మి. వయసు డెబ్బై ఐదేళ్లు. డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలోని బుచ్చెమ్మ అగ్రహారం ఆమె స్వస్థలం. చేతివేళ్లతోనే మట్టిని ముద్దగాచేసి, అందులో భక్తిని, ప్రకృతిపై ప్రేమను రంగరించి ముద్దులొలికే గణేశుడి ప్రతిమల్ని తయారుచేస్తున్నారు. రంగుల మాయలో పడి పర్యావరణాన్ని నాశనం చేస్తున్న నేటి తరానికి, స్వచ్ఛమైన మట్టి మూర్తులే మన సంస్కృతికి అసలైన ప్రతీకలని తన చేతల ద్వారా చాటి చెబుతున్నారు. పెళ్లయిన కొత్తలో వాళ్ల మామగారు వినాయకుడిని చేస్తుంటే చూసి నేర్చుకున్నారట. తర్వాత తానూ చేయాలనుకున్నా... చాలా ఏళ్లపాటు కుటుంబ బాధ్యతల దృష్ట్యా ప్రయత్నించలేకపోయారట. చివరికి వెంకటలక్ష్మి కల ఇరవై ఏళ్ల క్రితం తీరింది. అప్పట్నుంచి ఏటా మట్టితో లంబోదరుడి బొమ్మలు చేసి ఇంటి ముందు ప్రదర్శించేవారట. కాలక్రమేణా కొందరు తమకూ చేసివ్వమని అడగడంతో వాటిని అరుగు మీదే పెట్టి అమ్మడం మొదలుపెట్టారు. అలాగని పెద్దగా ప్రచారమూ చేయలేదు. ఒక్కోసారి కనీసం పది విగ్రహాలూ అమ్ముడు పోయేవి కావు... అయినా సంతృప్తికోసం ఏటా కొత్తవి చేస్తూనే ఉంటారు. ఇందుకోసం స్వయంగా మట్టిని సేకరిస్తారు. ఓ చిన్న ప్రతిమ తయారు చేయాలన్నా కనీసం రెండు గంటల సమయం పడుతుంది. అయినా ఎంతో ఉత్సాహంగా చేస్తారు. అంతేకాదు, ఈ ప్రతిమలకు నీరు తగలనివ్వకపోతే కనీసం అయిదేళ్లు చెక్కు చెదరకుండా ఉంటాయట. ‘ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దదో గణేశుడి విగ్రహం ఉండాలి... ఆ దేవుడి అనుగ్రహం అందరికీ కలగాలి. నాకు వీటితో డబ్బు సంపాదించాలనే ఆశలేదు. ఇష్టంతోనే చేస్తున్నా’ అని చెబుతారు వెంకటలక్ష్మి, ప్రస్తుతం ఆవిడ దగ్గర అంగుళం నుంచి రెండు అడుగుల ఎత్తువరకూ ప్రతిమలు లభిస్తాయి. లాభాపేక్ష లేకుండా ఈ బామ్మ విగ్రహాల్ని మాత్రమే చేయడం లేదు రాబోయే తరాల మనుగడకు కావలసిన పర్యావరణ స్పృహను జీవన పాఠంగా అందిస్తున్నారు. మామిళ్లపల్లి శ్రీభీమ్‌ రాహుల్‌కుమార్, అమలాపురం .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings





