
విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాథులతో వరంగల్‌లోని వీధులు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. రామన్నపేటలో లంబోదరుడు (Lord Ganesh) న్యాయమూర్తిగా దర్శనమిచ్చాడు. కోర్టు హాల్‌ తరహాలో ఏర్పాటు చేసిన మండపం భక్తులను ఆకట్టుకుంటోంది. విఘ్నేశ్వర యూత్‌ అసోసియేషన్‌ రంగురంగుల రాళ్ల గణపతిని ప్రతిష్ఠించింది. ఇందుకోసం ప్రత్యేకంగా చెన్నై నుంచి 75 కిలోల సముద్రపు రాళ్లను తెప్పించారు. పూరీజగన్నాథుడు, శ్రీరాముడు, శ్రీనివాసుడు, ముక్కంటిగా.. వివిధ ప్రాంతాల్లో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్లలో 7 అడుగుల మంచు గణపతి కొలువుదీరాడు. ఈ వీడియో చూశారా: సింహ వాహనంపై విహరించిన శ్రీ మలయప్పస్వామి విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాథులతో వరంగల్లోని వీధులు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి.




