
ఏలూరు: ఇటీవల మృతిచెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్‌ ( Nara Lokesh ) అన్నారు. ఏలూరులో నాని భౌతికకాయం వద్ద ఆయన నివాళులర్పించారు. నాని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో లోకేశ్‌ మాట్లాడారు. ‘‘ఆళ్ల నాని మృతి బాధాకరం. రాష్ట్రం మంచి వ్యక్తిని కోల్పోయింది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. నానిని శాసన మండలిలో కలిశాను. వ్యక్తిగత విమర్శలు వద్దు అని చెప్పేవారు. మండలిలో హుందాగా మాట్లాడేవారు. ఆయన కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటాను. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తాం’’ అని లోకేశ్‌ తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కర్నూలు జిల్లా ఆదోని మండలం తిరుమల నగర్‌లో వినాయక (Ganesh Pandal) మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఇటీవల మృతిచెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.