
కర్నూలు జిల్లా ఆదోని మండలం తిరుమల నగర్‌లో వినాయక (Ganesh Pandal) మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. 12 అడుగుల గణపతి విగ్రహం చుట్టూ పత్తితో ఉన్న అలంకరణకు మంటలు (Fire Accident) అంటుకుని వేగంగా వ్యాపించాయి. భయాందోళనకు గురైన భక్తులు ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. అనంతరం నిర్వాహకులు విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త చదివారా: ఆస్తి లాక్కొని తల్లిని చిత్రహింసలు పెడుతున్న కుమార్తెలు





