
ప్రముఖ సంగీత విద్యాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ పై అధికారిక ప్రకటన వెలువడింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ మూవీలో లీడ్ రోల్ పోషిస్తోంది. జెర్సీ, కింగ్డమ్ వంటి సినిమాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
© 2026 nimisham.in

ప్రముఖ సంగీత విద్యాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ పై అధికారిక ప్రకటన వెలువడింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ మూవీలో లీడ్ రోల్ పోషిస్తోంది. జెర్సీ, కింగ్డమ్ వంటి సినిమాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే భారీ ప్రయత్నం చేయబోతున్నారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బుధవారం ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. రశ్మిక మందన్నపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి కమల్ హాసన్ క్లాప్ ఇచ్చారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఎంతో బిజీగా ఉన్నా మేము పిలవగానే ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన కమల్ హాసన్ గారికి థ్యాంక్స్. ఈ ఆడిటోరియంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ చిత్రపటం చూడగానే కాసేపు ఎమోషనల్ ఫీల్ కలిగింది. ఆమే మమ్మల్ని ఈ సినిమా చేసేందుకు ఎంచుకుందనే భావనకు లోనయ్యాను. రష్మికను కూడా ఆమే ఎంచుకుందని అనిపించింది. ఎంఎస్ అమ్మ గొప్ప సంగీతకారిణిగా మనందరికీ తెలుసు. కానీ ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఘటనల గురించి తెలిశాక ఈ బయోపిక్ తీయాలని మరింతగా ఇన్స్ పైర్ అయ్యాం. ఆమె పాటించిన నిబంధనలు, చూపించిన ధైర్యం, క్రమశిక్షణ చాలా గొప్పవి. ఆమె పదేళ్ల ప్రాయం నుంచే సంగీతం పట్ల తన ఇష్టాన్ని చూపిస్తూ గొప్ప లక్ష్యం వైపు చెదరని ఏకాగ్రతతో పయణించారు. ఎంఎస్ అమ్మ ఎంత ఇబ్బందికరమైన జీవితాన్ని గడిపారో చాలామందికి తెలియదు. మా దర్శకుడు గౌతమ్ గత ఏడాదికాలంగా బయోపిక్ రీసెర్చ్ లో భాగంగా ఎన్నో ప్రదేశాలకు వెళ్లారు. ఎంతోమందిని కలిశారు. గౌతమ్ ఆయన టీమ్ గ్రేట్ వర్క్ చేశారు. గౌతమ్ ఒక పెద్ద సినిమాకు సంప్రదింపుల్లో ఉండగా మేము ఈ సినిమా కోసం అడిగిన వెంటనే ఆ ప్రాజెక్ట్ వదులుకుని వచ్చారు. ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ ఏడేళ్లుగా ఈ సినిమా నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారు. అమ్మ కుటుంబ సభ్యులను కలిసి రైట్స్ తీసుకున్నారు. అమ్మ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మా వెనక ఉండి ఈ సినిమా చేసేందుకు సహకరిస్తున్నారు. ఈతరం వచ్చే తరం మధ్య వారధిలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ కు న్యాయం చేయగలరు అనిపించింది. సుప్రభాతం మొదలుకుని ఎంఎస్ అమ్మ సంగీతం మనకు ప్రతి సామాజిక మాధ్యమంలోనూ వినిపిస్తుంటుంది. ఆమె సంగీతాన్ని రీక్రియేట్ చేసే సాహసం మేము చేయడం లేదు. అనిరుధ్ సంగీతంతో ఒక గొప్ప బయోపిక్ రూపొందిస్తున్నాం. నాలుగు దక్షిణ భారత భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని అన్నారు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
Help others stay updated with verified breaking news and insights.






