
భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ ‘ఎం.ఎస్’ (A Legacy On Screen) ప్రారంభోత్సవంలో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నటి రష్మిక మందన్న పాల్గొన్నారు. ఎంఎస్ అమ్మ కేవలం ఒక గొప్ప సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదని, ఆమె జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అల్లు అరవింద్ తెలిపారు. గత ఏడాదికాలంగా రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని సిద్ధం చేశామని, క్రమశిక్షణతో కూడిన ఆమె జీవిత ప్రయాణం ఈనాటి తరానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక పాత్రను ఎంతో గౌరవంగా, బాధ్యతతో పోషిస్తానని రష్మిక అన్నారు.





