
హిందూపురం: హిందూపూర్ నుంచి కదిరికి వెళుతున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో మంగళవారం అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రయాణికులతో బస్సు బయలుదేరి మేళాపురం సర్కిల్‌కు చేరుకున్న సమయంలో బస్సు మధ్య భాగంలో నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనతో కిందకు దిగారు. అనంతరం బస్సును స్థానిక డిపోకు తీసుకెళ్లారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





