
తిరుమల భక్తుల సౌకర్యార్థం అనంత్ అంబానీ టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించారు. ఈ బస్సుల నిర్వహణ, 50 మంది
డ్రైవర్ల జీతభత్యాలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, మరమ్మతులు సహా మొత్తం వ్యయాన్ని రిలయన్స్ సంస్థే భరిస్తుంది. టీటీడీకి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా భక్తులకు నిరంతర సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.