
ముందుగా ఫోన్ భౌతిక పరిస్థితిని అంచనా వేయండి. దానిపై గీతలు, డెంట్లు లేదా ఇతర గుర్తులు ఉన్నాయేమో పరిశీలించండి. స్క్రీన్‌పై పగుళ్లు ఉన్నాయేమో చూడండి. ఫోన్ వాడకంలో బ్యాటరీ లైఫ్ చాలా కీలకం.
బ్యాటరీ కండిషన్ ఎలా ఉందో అమ్మేవారిని అడగండి. దాని కెపాసిటీ, కాలక్రమేణా ఎంత తగ్గిందో సమాచారం తీసుకోండి.
మీరు కొనాలనుకుంటున్న ఫోన్ మోడల్ మార్కెట్ విలువను తెలుసుకోండి. ఇతర అమ్మకందారులు అందిస్తున్న ధరలతో పోల్చి చూసి, మీరు మంచి డీల్ పొందుతున్నారో లేదో నిర్ధారించుకోండి.
ఫోన్ పనితీరును చూడటానికి యాప్స్ రన్ చేయండి, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయండి, కెమెరా క్వాలిటీని చెక్ చేయండి. ఫోన్ లాగ్ అవ్వడం లేదా ఫ్రీజ్ అవ్వడం వంటి సమస్యలు ఉన్నాయేమో గమనించండి.
ఆ ఫోన్ మీ నెట్వర్క్ ప్రొవైడర్‌కు సపోర్ట్ చేస్తుందో లేదో లేదా అన్‌లాక్ చేయబడిందో లేదో ధృవీకరించుకోండి. కొన్ని ఫోన్లు క్యారియర్-లాక్ చేయబడి ఉంటాయి. ఇది మీ ఆప్షన్లను తగ్గిస్తుంది.
5 Best Flagship Smartphones: ఆగస్టు 2025లో కొనదగ్గ 5 బెస్ట్ ఫోన్లు
పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో ఉంచుతున్నారా? జాగ్రత్త
ఎలక్ట్రికల్ ఎక్స్టెన్షన్ బోర్డు వాడుతున్నారా? ఇలా చేస్తే ప్రమాదమే