
జస్ట్ ఊహించుకోండి.. మీరు మీ మనసులో ఏదైనా అనుకోగానే, చేతులతో టైప్ చేయకుండా లేదా నోటితో చెప్పకుండానే అది స్క్రీన్‌పై టెక్స్ట్‌గా మారిపోతే ఎంత బాగుంటుంది!
వినడానికి ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా సీన్లా అనిపిస్తోంది కదూ. కానీ ఇప్పుడు ఇది నిజం కాబోతోంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇలాంటి ఒక అద్భుతమైన సిస్టమ్‌ను సిద్ధం చేసింది. ఇది మీ మనసులోని మాటను చదివి, నేరుగా టెక్స్ట్‌గా మార్చేస్తుంది.
అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే.. ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీలా దీనికోసం తలలో ఎలాంటి చిప్ పెట్టాల్సిన అవసరం లేదు, సర్జరీ చేయించుకోవాల్సిన పనిలేదు. కేవలం ఒక స్పెషల్ హెల్మెట్ పెట్టుకుంటే చాలు, ఈ మ్యాజిక్ జరిగిపోతుంది. మెటా తెచ్చిన ఈ సరికొత్త బ్రెయిన్ గేమ్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.
మెటా కంపెనీ 'Brain2Qwerty V2' అనే సరికొత్త ఏఐ సిస్టమ్‌ను డెవలప్ చేసింది. ఇది మీ మెదడులోని కదలికలను అంటే బ్రెయిన్ యాక్టివిటీని గుర్తించి, వాటిని పదాలుగా మార్చగలదు. మెటా కంపెనీ చెప్తున్న దాని ప్రకారం.. పారాలిసిస్, బ్రెయిన్ ఇంజూరీ లేదా ఇతర జబ్బుల వల్ల మాట్లాడలేని, రాయలేని వారికి ఈ టెక్నాలజీ ఒక వరం లాంటిది. ఈ సిస్టమ్ సాయంతో అలాంటి వారు కేవలం ఆలోచించడం ద్వారానే తమ మనసులోని మాటను ఇతరులతో పంచుకోవచ్చు. ఇది మెటా గత ఏడాది తీసుకొచ్చిన Brain2Qwerty రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు సెకండ్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్.
ఒకవైపు ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ బ్రెయిన్ లోపల చిప్‌ను అమర్చడానికి సర్జరీలపై వర్క్ చేస్తోంది. కానీ మెటా తీసుకొచ్చిన ఈ సిస్టమ్ మాత్రం పూర్తిగా నాన్ ఇన్వేసివ్. అంటే ఎలాంటి సర్జరీ అవసరం లేనిది. దీనికోసం యూజర్ ఒక స్పెషల్ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. ఇది చూడటానికి పెద్ద హెయిర్ డ్రైయర్ లాగా కనిపిస్తుంది. ఈ హెల్మెట్‌లో మాగ్నెటోఎన్సెఫాలోగ్రఫీ టెక్నాలజీని వాడారు. మెదడులోని న్యూరల్ యాక్టివిటీ వల్ల క్రియేట్ అయ్యే అత్యంత బలహీనమైన అయస్కాంత క్షేత్రాలను ఈ టెక్నాలజీ ఈజీగా పట్టుకుంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర పద్ధతులు చాలా ఖరీదైనవి.. రిస్క్‌తో కూడుకున్నవి. ఎందుకంటే వాటికి బ్రెయిన్ సర్జరీ చేయాలి. కానీ మెటా హెల్మెట్ మాత్రం చాలా సేఫ్ అండ్ ఈజీ అని కంపెనీ చెబుతోంది.
ఈ అద్భుతమైన సిస్టమ్‌కు ట్రైనింగ్ ఇవ్వడం కోసం మెటా కంపెనీ 9 మంది వాలంటీర్ల హెల్ప్ తీసుకుంది. వారు ఈ హెల్మెట్ పెట్టుకుని దాదాపు 10 గంటల పాటు టైపింగ్ చేశారు. ఈ ప్రాసెస్‌లో ఏఐ కి దాదాపు 22,000 వాక్యాల డేటా లభించింది. మెటా తన పాత వెర్షన్‌తో పోలిస్తే, ఈ కొత్త Brain2Qwerty V2 లో మెదడు నుంచి వచ్చే రా సిగ్నల్స్‌ను నేరుగా అనలైజ్ చేసి, ఆటోమేటిక్‌గా ప్యాటర్న్‌లను గుర్తిస్తుంది.
సాధారణంగా సర్జరీ లేకుండా వాడే ఇలాంటి నాన్ ఇన్వేసివ్ పద్ధతుల్లో అక్యురెసీ కేవలం 8% వరకు మాత్రమే ఉంటుంది. కానీ మెటా డెవలప్ చేసిన ఈ సిస్టమ్ ఏకంగా 61% అక్యురెసీని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక యూజర్ విషయంలో అయితే ఈ ఖచ్చితత్వం ఏకంగా 78% వరకు కనిపించడం విశేషం.
మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్‌లో ఎలాంటి అడ్డంకులు వచ్చినా, వాటిని క్లియర్ చేయడానికి మెటా ఇందులో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సహాయం తీసుకుంది. ఇది మన స్మార్ట్‌ఫోన్‌లోని ఆటోకరెక్ట్ ఫీచర్‌లాగా పనిచేస్తుంది. గ్రామర్ రూల్స్ ప్రకారం కరెక్ట్ పదాలను తానే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ రీసెర్చ్ అంతా మెటా చేపట్టిన డిజిటల్ బ్రెయిన్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. ఈ ప్రాజెక్ట్ కింద ఓపెన్ న్యూరోసైన్స్ డేటాసెట్ కోసం కంపెనీ 5 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 41 కోట్లు ఫండ్ ఇస్తోంది. అయితే, ఈ రేసులో మెటా ఒక్కటే లేదు.. సిలికాన్ వ్యాలీకి చెందిన సబి అనే స్టార్టప్ కంపెనీ కూడా మెదడు సిగ్నల్స్‌ను గుర్తించే ఇలాంటి ఒక స్పెషల్ క్యాప్‌పై వర్క్ చేస్తోంది.