ఫీజు రీయంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి వద్ద ఏబీవీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
ఏబీవీపీ నాయకులు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఈసందర్భంగా పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఉద్రిక్తత |