
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలోని హైదరాబాద్ అంకురం స్కైరూట్ (Skyroot) ఏరోస్పేస్ మరో మైలు రాయిని చేరుకుంది.
శ్రీహరికోటలోని ఇస్రో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ వద్ద విక్రమ్-1 రాకెట్ (Vikram-I) మొదటిదశను విజయవంతంగా అమర్చింది. ఇది తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్. ప్రైవేట్‌గా రూపొందించిన దీనిని ఇస్రో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ (Isro launch pad)పై అమర్చడం ఇదే మొదటిసారి. ఇందుకు సంబంధించిన చిత్రాలను స్కైరూట్ ‘ఎక్స్’లో షేర్ చేసింది.
ఒక్కో భాగం చొప్పున విక్రమ్-I (Vikram-I) రూపుదిద్దుకుంటోందని స్కైరూట్ తెలిపింది. ప్రతి దశను జాగ్రత్తగా అమర్చి, ప్రయోగానికి సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించింది. స్కైరూట్ ఏరోస్పేస్ కొన్ని రోజుల్లో తన తొలి కక్ష్య ప్రయోగాన్ని విక్రమ్-1 రాకెట్‌తో చేపట్టనుంది. చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష్యలోకి తీసుకువెళ్లడానికి దీనిని రూపొందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ముంబయి(Mumbai)ని ముంచెత్తుతున్నాయి.