
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Ktr Slams on Telangana Congress Govt: తెలంగాణలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఎక్కడ చాన్స్ దొరికిన కూడా నేతలు ఒకరిపై మరోకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పలు మార్లు ఆరుగ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ను ఏకీపారేస్తున్నారు. ఎన్నికల్లో అమలుకు సాధ్యం కానీ 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేశారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడుతు ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. 30 నెలల ముదనష్టపు పాలనలో.. దాదాపు 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా ?.. అంటూ కేటీఆర్ ఏకీపారేశారు. గత రెండున్నరేళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే.. ఆశీర్వాద సభల పేరిట డ్రామాలా .. అంటూ విమర్శలు గుప్పించారు. కేవలం ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే.. నీచానికి కాంగ్రెస్ దిగజారీందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన మీ ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం మీ అవివేకమని అన్నారు. ప్రతి ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తానని చెప్పి, చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు. అరకొరగా ఒకటి, రెండు ఎకరాలకు వేసినట్టు చేసి చేతులు దులుపుకుంటున్న మీ పాపం మిమ్మల్ని నిరంతరం శాపంలా వెంటాడటం ఖాయమన్నారు. ఇప్పటికే 50 వేల కోట్లతో చేయాల్సిన రెండులక్షల రుణమాఫీని, చారాణా కూడా చేయలేదన్నారు. 72 సార్లు నీ ఢిల్లీ టూర్లకు, పనికిరాని ఈ పబ్లిక్ మీటింగ్ లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదాచేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేదని కేటీఆర్ ఏకీపారేశారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసే ఈ దిక్కుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయవని గుర్తుపెట్టుకోవాలంటూ కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్న మీ చేతకానితనాన్ని చూసి అన్నదాతలు పట్టలేని కోపంతో రగిలిపోతున్నారన్నారు.
Read more: Kalvakuntla Kavitha: ఇడుపు కాయితం అంటే పవన్ కళ్యాణ్‌కు బాగా తెలుసు.!. కవిత సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ గారు టంచన్ గా 11 సార్లు, 73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాలో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారని గుర్తు చేశారు. పదేళ్లు పండగలా సాగిన వ్యవసాయాన్ని దండగలా మార్చి, రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న మీ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ గారు నిలిచి ఉంటే.. కాంగ్రెస్ ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.