
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ మా ఇంటి బంగారం. సామ్ భర్త రాజ్ నిడిమోరు కథ అందించగా.. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.
ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమా యాక్షన్ సీన్లలో సామ్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా సక్సెస్ మీట్ లో సామ్ బేబీ బంప్ వైరల్ కావడంతో ఆమె తల్లి కాబోతుందనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక ఆ మూవీ థాంక్స్ మీట్ లో సామ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అలాగే మా ఇంటి బంగారం సినిమా తర్వాత తాను కొన్ని రోజులు విరామం తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో సమంత ఈ గుడ్ న్యూస్ తనకు చెప్పారని.. ఎవరికీ చెప్పొద్దన్నారని దర్శకురాలు నందినిరెడ్డి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Irumudi : సాంగ్ అదిరిపోయింది.. ఇరుముడి నుంచి ఇరుముడి కట్టు పాట రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే భయ్యా..
నందినిరెడ్డి మాట్లాడుతూ.. “9 గంటలకు షూట్ ప్రారంభమవుతుందంటే సామ్ కచ్చితంగా ఆ సమయనికి సెట్ లో ఉంటారని.. తస్సాదియా సాంగ్ షూటింగ్ సమయంలో సమంతకు జ్వరం వచ్చిందని.. 11.30 వస్తారని అన్నారు. నాకేమో టెన్షన్.. మొదట ఈ పాటను 4 రోజులు చేయాలని అనుకున్నాం. షెడ్యూల్ కారణంగా రెండు రోజులకు కుదించాల్సి వచ్చింది. ఒక వైపు సామ్ హెల్త్ బాలేదు.. మరోవైపు ఎలా పూర్తవుతుందా అనే టెన్షన్.. ముందుగా చెప్పినట్లు 11.30కు వచ్చి షూట్ కంప్లీట్ కాగానే వెళ్లిపోయింది. మళ్లీ రెండో రోజు రాగానే జ్వరం తగ్గిందా.. ఎందుకు అలా ఊరికే వస్తుంది అని అడిగాను. జ్వరం కాదు.. నేను ప్రెగ్నెంట్ . ఈ విషయం ఎవరికీ చెప్పకు అని చెప్పింది. ఆ సమయంలో చాలా సంతోషంగా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Samantha : సమంత తినే ఫుడ్ ఎవరూ తినలేరు.. 2 ఏళ్లు అలాంటి ఆహారం.. నందినీరెడ్డి..
సమంత ప్రెగ్నెంట్ అని తెలియగానే తాను డ్యాన్స్ మాస్టర్ దగ్గరకు వెళ్లి ఆమెకు ఆరోగ్యం బాలేదు.. తనతో ఎక్కువగా రిహార్సల్స్ చేయించొద్దు అని చెప్పాను. చిన్న చిన్న స్టెప్పులతోనే కంటిన్యూ చేద్దామని చెప్పానని.. ఆ పాటను సమంత సిక్ నెస్ తోనే పూర్తి చేసిందని అన్నారు. అలాగే యాక్షన్ సీన్స్, కార్ యాక్సిడెంట్ సీన్, ఛేజింగ్ సీన్స్ కూడా తర్వాత షూట్ చేసినవే అని అన్నారు. ఎప్పుడూ 3.30 తర్వాత నీడలో షూట్ చేశామని.. ఆమె ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా చూసుకున్నామని నందినిరెడ్డి అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Raghu Babu : ఆ సినిమా తర్వాత అవకాశాలే రాలేదు.. నన్ను చూసి జనాలు భయపడ్డారు.. నటుడు రఘుబాబు..
ఎక్కువ మంది చదివినవి : Prabhas : ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు..