చిట్టి ఉన్నప్పుడు అన్నయ్య పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేది.. రాత్రి 8 గంటలకు అన్నయ్య పుట్టాడని.. 8 గంటలకే కేక్ కట్ చేయింది..
చిట్టి దూరమైన ఈ 25 ఏళ్లలో అన్నయ్య బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోలేదు.. చిట్టి ఇంటికి వచ్చాకే సెలెబ్రేట్ చేసుకుంటా అని అంటాడు అని సునంద చెప్పిన మాటలకు రాధ ఎమోషనల్ అవుతుంది. ఇక చిట్టి ఎప్పుడు వస్తుందో.. ఈ ఇంటికి ఆనందం తిరిగి ఎప్పుడు వస్తుందో అని సునంద కన్నీరు పెట్టుకుంటుంది. ఇంకో వైపు రాధకు సంబంధించిన నిజాన్ని చెప్పేద్దామని పద్మతో శీనయ్య చెబుతాడు.ఇప్పుడు నిజం చెప్పాల్సిన అవసరం ఏం వచ్చింది అని పద్మ అంటుంది. రాధ ప్రాణాలకు ప్రమాదం ఉంది.. సొంత తల్లిదండ్రులకు చెప్తే వారే చూసుకుంటారు.. ఈ జైల్లో నేను.. ఒంటరిగా నువ్వు.. రాధని కాపాడలేం కదా అని శీనయ్య అంటాడు. సరే చెప్పేద్దాం అని పద్మ అంటుంది. మరి రాధ తల్లిదండ్రులు ఎవరు? అని పద్మ అడుగుతుంది. శీనయ్య నిజం చెప్పాలని అనుకుంటాడు. కానీ పరుశురాం గాడు చాటుగా వింటున్నాడని తెలిసి ఆగిపోతాడు శీనయ్య. నువ్వు వెళ్లి రాధను తీసుకు రా.. నిజం చెప్తా అని శీనయ్య అంటాడు.🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : సూదులు గుచ్చినట్టుగా మాట్లాడిన బస్తీవాసులు.. మంట పెట్టిన తాయారు.. మహా మనసు మారుతుందా?ఇంకో వైపు చిట్టిని తల్చుకుంటూ రామచంద్ర బాధ పడుతుంటాడు. ఇక ఇంతలో చిట్టిగా రామచంద్రకు ఫోన్ చేసి మాట్లాడుతుంది రాధ. ఇంత కాలం ఎక్కడున్నావ్.. ఎవరు పెంచారు? ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు.. వస్తానమ్మా అని ప్రశ్నలతో రాధను ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు రామచంద్ర. నేను రేపు వచ్చి అన్నీ చెప్తా నాన్నా.. రేపు నీ బర్త్ డేని గ్రాండ్‌గా ఏర్పాటు చెయ్యి.. సరిగ్గా 8 గంటలకు నేను వస్తా. అప్పుడే కేక్ కట్ చెయ్యి అని రాధ అంటుంది. సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని రామచంద్ర అంటాడు.ఇక రెట్టించిన సంతోషంతో రామచంద్ర హాల్లోకి వచ్చి అందరినీ పిలుస్తాడు. అందరూ వచ్చిన తరువాత.. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు.. అని అడుగుతారు. నా చిట్టి తల్లి దూరం అవ్వడంతో పోయిన సంతోషం.. నా చిట్టితల్లి రాకతో వస్తోంది.. నా చిట్టి వస్తోంది.. రేపు వస్తోంది అని రామచంద్ర అంటాడు. దీంతో అందరూ సంతోషిస్తారు. విక్రమ్‌కి కూడా ఈ మాటలు చెబుతాడు రామచంద్ర. అవునా? మన చిట్టి వస్తోందా? అని విక్రమ్ సంతోషిస్తాడు. రాధకి ఈ విషయం చెప్పి తెగ సంతోషిస్తాడు రామచంద్ర.🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: సస్పెండ్ అయిన అరుణ్.. మీ అంత పైశాచికత్వం నాకు లేదు.. బాలుతో వాదించిన మీనాఅంతా నువ్వు చెప్పినట్టే జరుగుతోంది.. నువ్వు అడుగు పెట్టిన వేళావిశేషం అని రాధతో అంటాడు రామచంద్ర. రాధ, రామచంద్ర హాయిగా నవ్వుతూ ఉన్న టైంలో దమయంతి వస్తుంది. ఏం జరుగుతోంది అని దమయంతి అంటుంది. మన చిట్టి వస్తోంది అని రామచంద్ర చెప్పడంతో దమయంతి షాక్ అవుతుంది. ఏంటి.. మన చిట్టినా? ఆ శీనయ్య గాడు నిజం చెప్పాడా? అని దమయంతి భయపడుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.