
సోషల్ మీడియాలో సంచల జాతకాలు చెప్తూ సెన్సేషనల్ అయిన వేణు స్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళు జాతకాలు కలవటం కోసం పేర్లు మార్చుకోవటం అన్న అంశంపైన...
సోషల్ మీడియాలో సంచల జాతకాలు చెప్తూ సెన్సేషనల్ అయిన వేణు స్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళు జాతకాలు కలవటం కోసం పేర్లు మార్చుకోవటం అన్న అంశంపైన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తన ఇటీవలి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.పేర్లు మార్చుకోవడం వల్ల జీవితం మారిపోతుందాపెళ్లిళ్లు, వివాహాలు, విడాకులు మరియు ఆధునిక సాంకేతికత వంటి అంశాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పేర్లు మార్చుకోవడం వల్ల జీవితం మారిపోతుందని నమ్మేవారిని తీవ్రంగా విమర్శించారు.నేను రేవంత్ రెడ్డి అని పేరు పెట్టుకుంటే సీఎం అవుతానా? అని ప్రశ్నించి, పేర్లు మార్చినంత మాత్రాన ఏమీ జరగదని స్పష్టం చేశారు. కొందరు జ్యోతిష్యులు జాతకాలు సరిగ్గా చూడకుండానే పేర్లు మార్చి వివాహాలు జరిపిస్తున్నారని, అందుకే విడాకులు అవుతున్నాయని మండిపడ్డారు.జాతకాలు సరిగ్గా కలవకపోవడమే విడాకులకు కారణం ఇలాంటి పద్ధతులు పూర్తిగా తప్పని, జాతకాలు సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. పెళ్లి తర్వాత విడాకులు వచ్చే పరిస్థితులకు ప్రధాన కారణం జాతకాలు సరిగ్గా కలవకపోవడమే అని ఆయన బలంగా చెప్పారు.. అబ్బాయి-అమ్మాయి జాతకాలు ఎంతవరకు సరిపోతాయో, వారి భవిష్యత్తులో విడిపోయే అవకాశాలు ఉన్నాయా అనేది ముందుగా తెలుసుకోవచ్చన్నారు. అయితే కేవలం గణాలు చూసి ముహూర్తం నిర్ణయించడం సరికాదని హెచ్చరించారు.సమయం కేటాయించకుండానే ముహూర్తాలు నిర్ణయిస్తున్నారన్న వేణుస్వామిజాతకాల్లో గణాలతో పాటు యోని దోషం, వర్ణ దోషం, ఏకనాడి దోషం, శష్ఠాష్టక దోషం వంటి ఎనిమిది రకాల దోషాలను కూడా పూర్తిగా పరిశీలించాలని వివరించారు. జ్యోతిష్య రంగంలో కొందరు జ్యోతిష్యులు సమయం కేటాయించకుండానే ముహూర్తాలు నిర్ణయిస్తున్నారని వేణుస్వామి ఆరోపించారు. ఇలాంటి తప్పుల వల్లే ఎన్నో వివాహాలు విడాకుల దాకా వెళ్తున్నాయని అన్నారు. జాతకాలు సరైన పద్ధతిలో చూస్తే ఎక్కువ సమస్యలు రావని, జ్యోతిష్యులు బాధ్యతగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు.తెలంగాణలో జులై 4వరకు ఈ జిల్లాలకు భారీవర్షాల హెచ్చరిక!2032 నాటికి ఏఐ ప్రాధాన్యత తగ్గుతుంది ఆధునిక సాంకేతికత మానవ జ్ఞానాన్ని మించినది కాదని అన్నారు. AIని తెరిచి జాతకం గురించి అడిగితే కొంత బేసిక్ సమాచారం ఇస్తుందని, కానీ మనిషి జ్ఞానానికి దీని సామర్థ్యం సరిపోదని అన్నారు. రానున్న రోజుల్లో AIపై ఆసక్తి తగ్గిపోతుందని, 2032 నాటికి దాని ప్రాధాన్యత తగ్గుతుందని వేణు స్వామి జోస్యం చెప్పారు. జ్యోతిష్య రంగంలో మనుషుల అనుభవం, జ్ఞానం ఎప్పటికీ AIకి పోటీ కాదని వేణుస్వామి స్పష్టం చేశారు.