
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ ఫస్టియర్ ప్రాక్టికల్స్ నిర్వహణపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరిగా చేయాలనే నిర్ణయానికి వచ్చింది.
ఇప్పటికే ప్రయోగ పరీక్షల అంశాలను వెల్లడించిన బోర్డు.. మరో 15 రోజుల్లో ప్రాక్టికల్స్‌కు సంబంధించిన విధివిధానాలతో మాన్యువల్‌ను విడుదల చేసి, బోర్డు వెబ్సైట్లో పెడతామని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. గత ఏడాది వరకు సెకండియర్‌లో మాత్రమే ప్రయోగ పరీక్షలు జరిపేవారు. ఈ ఏడాది నుంచి ప్రథమ సంవత్సరంలో ప్రాక్టికల్స్ పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీసీ 60 మార్కుల్లో సగం, బైపీసీ 120 మార్కుల్లో 60 ఫస్టియర్‌కు కేటాయించారు. ఈసారి గణితానికి కూడా అంతర్గత మార్కులు ఉంటాయని బోర్డు ప్రకటించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.