
భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందం వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. తమ నీటి వాటా జోలికి వస్తే చేతులు నరికేస్తామంటూ పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌కు తీవ్ర...
భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందం వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. తమ నీటి వాటా జోలికి వస్తే చేతులు నరికేస్తామంటూ పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.ఇస్లామాబాద్‌లో సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముసాదిక్ మాలిక్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. "పొరుగు దేశ ప్రధాని చేతిలో ఒక ట్యాప్ ఉంది. పాకిస్థాన్‌కు ఒక్క చుక్క నీరు కూడా రాకుండా చేస్తానని ఆయన అంటున్నారు. మా నీటి వాటాను కాజేయాలని చూసేవారి చేతులను నరికివేస్తాం" అని ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్‌కు కేటాయించిన నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి భారత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ.. సింధు జలాల ఒప్పందం చట్టబద్ధంగా కొనసాగుతోందని, దానిని ఏకపక్షంగా నిలిపివేయడం గానీ, రద్దు చేయడం గానీ, సవరించడం గానీ సాధ్యం కాదని అన్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ వాదనకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందని, ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించలేదని తెలిపారు. "నీరు మాకు జీవనాధారం, అదే మా రెడ్ లైన్" అని ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఈ ఒప్పందంపై లోతైన