
రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటానికి శాస్త్రవేత్తలు ఎంజైమ్‌లు, జన్యువులు, గ్రాహకాల మీదే దృష్టిసారిస్తున్నారు. తాజాగా ఐఐటీ బాంబే పరిశోధకులు వినూత్న కేటీడీపీ అనే చిన్న పెప్టైడ్‌ను రూపొందించారు.
ఇది రక్తంలోకి కొలెస్ట్రాల్‌ను పంపించే కాలేయ కణాల్లోకి కొవ్వు చేరకుండా చూస్తుంది. ప్రయోగశాలలో వృద్ధి చేసిన కాలేయ కణాలు, జీబ్రా చేపలపై దీన్ని పరీక్షించగా రక్తంలోకి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు విడుదలవడం 50% వరకు తగ్గింది. ఇక మనుషులపై పరీక్షించాల్సి ఉంది. వివరాలకు.. కొలెస్ట్రాల్‌కి వేయండి కొత్తగా అడ్డుకట్ట .. |