
ఈనాడు,హైదరాబాద్, ఘట్కేసర్, న్యూస్టుడే : ‘‘జెన్-జీ తరం అంటే సరికొత్త భారత నిర్మాణంలో భాగస్వాములు. మీ చుట్టూఉన్న ప్రజల కోసం పోరాడాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రండి.
మీరే సొంతంగా లక్ష్యాలను నిర్ణయించుకోండి. అనుభవం పెరిగేకొద్దీ విజయాలు సాధిస్తారు. ఇందుకోసం మీరు ఎంచుకున్న మార్గం స్పష్టంగా ఉండాలి. మనకున్నది ఒకే జీవితం. ఆనందంగా.. సంతోషంగా అనుభవించండి. మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను పాడుచేసుకోవద్దు. అమ్మానాన్నల కంటనీరొస్తే మనకు భవిష్యత్ ఉండదు. అనుకోని సంఘటనల వల్లే నేను రాజకీయాల్లో వచ్చా. 26ఏళ్లకే ఎమ్మెల్యేనయ్యా. తొలుత పరిస్థితులు గందరగోళంగా అనిపించేవి. తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి నా దృష్టికోణం మారింది. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయడమే నా దినచర్య అయింది. అందుకే పార్టీ సభ్యుడి నుంచి అధ్యక్షుడి వరకు కొనసాగిన నా ప్రయాణం పూర్తిగా నా పార్టీదే’’
వీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ‘వికసిత్ భారత్- స్టూడెంట్ కాన్క్లేవ్’లో నితిన్ నబీన్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.