
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చల వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇరాన్‌తో ఖతార్ రాజధాని దోహాలో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నొక్కిచెబుతుండగా, అలాంటి సమావేశమేదీ ఖరారు
కాలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరు దేశాల నుంచి వస్తున్న ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు, ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై తీవ్ర అనిశ్చితిని రేకెత్తిస్తున్నాయి.వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అణు కార్యక్రమంపై దోహాలో రేపు (బుధవారం) ఒక సమావేశం జరగబోతోందని ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటాన్ని తాము అంగీకరించబోమని, ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. దీనికంటే ముందే, ఇరానే స్వయంగా చర్చల కోసం అభ్యర్థించిందని, రేపు దోహాలో భేటీ ఉంటుందని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా వెల్లడించారు.అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ తీవ్రంగా ఖండించారు. రాబోయే రోజుల్లో అమెరికాతో ఎలాంటి చర్చలు ప్రణాళికలో లేవని, ఏ స్థాయిలోనూ వారితో భేటీలు జరగవని స్పష్టం చేశారు. తమ సాంకేతిక బృందం ఈ వారం ఖతార్ వెళ్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, దానికి అమెరికా అధికారుల రాకతో ఎలాంటి సంబంధం లేదని, దీనిని ద్వైపాక్షిక చర్చలుగా భావించలేమని ఆయన తోసిపుచ్చారు.అయినప్పటికీ, దోహాలో మంగళవారం చర్చలు జరిగే అవకాశం ఉందని ఒక సీనియర్ ఇరాన్ అధికారి రాయిటర్స్‌తో పేర్కొనడం గమనార్హం. ఈ చర్చలు గతంలో స్విట్జర్లాండ్‌లో జరిగిన సాంకేతిక చర్చల్లా కాకుండా, అంతర్జాతీయంగా కీలకమైన