
డా. పి. యష్మన్, సోనాలీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “చంద్రప్పన్”. హీరోగా నటించడంతో పాటు ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, డైరెక్షన్ చేస్తున్నారు డా.పి. యష్మన్.
“చంద్రప్పన్” సినిమాను ఎలిగెంట్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. జూలై 24న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో
డైరెక్టర్ వి.సముద్ర మాట్లాడుతూ – ఈ సినిమా పేరు “చంద్రప్పన్” అయినా వీరప్పన్ లా టైటిల్ సౌండింగ్ ఉంది. హీరో యష్మన్ ను చూస్తుంటే మా హీరో రాజశేఖర్ లా డాక్టర్ చదివి ఆ తర్వాత హీరో అయినట్లు కనిపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. రా అండ్ రస్టిక్ మేకింగ్ తో ఆకట్టుకుంటోంది. యష్మన్ కథ స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్, పాటలు రాయడం విశేషం. ఆయన ఈ కథలో ఒదిగిపోయి నటించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. హీరోయిన్ కు కూడా ఈ చిత్రంతో మంచి పేరు రావాలి. “చంద్రప్పన్” సినిమాను తెలుగు ఆడియెన్స్ బాగా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ కేఎల్ దామోదరప్రసాద్ మాట్లాడుతూ – హీరో యష్మన్ డాక్టర్ చదివాక మధ్యలో వచ్చిన ఇంట్రెస్ట్ సినిమా అని తెలిసింది. ఆయనకు చిన్నప్పటి నుంచి ఉన్న ప్యాషన్ కాదు. అయితే ఆయనలో సినిమా పట్ల ప్యాషన్ లేనిదే ఇన్ని క్రాఫ్టులు హ్యాండిల్ చేయలేరు. సాధారణంగా ఒక క్రాఫ్ట్ హ్యాండిల్ చేయడమే కష్టం. గెస్టులుగా చాలా సినిమాలకు పిలుస్తుంటారు. ఏదో చేసి ఉంటారులే అనుకున్నా కానీ ఈ సినిమా ట్రైలర్, పాటలు చూశాక ఇంప్రెస్ అయ్యాను. మంచి క్వాలిటీతో కంటెంట్ తో సినిమా చేశారు. ఇలాంటి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తేనే మరిన్ని మూవీసే చేయగలగుతారు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
హీరో, డైరెక్టర్ డా.పి.యష్మన్ మాట్లాడుతూ – ఫిలింఛాంబర్ కు ఏ కొత్త ప్రొడ్యూసర్ వెళ్లినా దామోదర ప్రసాద్ గారు ఇండస్ట్రీలోని మంచి చెడ్డలు చెబుతుంటారు. సినిమా నిర్మించే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోమని సలహా ఇస్తారు. ఆయన సలహాలు ఎంతో విలువైనవి. అవన్నీ మేము పాటించే ఈ సినిమాను రూపొందించాం. డైరెక్టర్ సముద్ర గారి సింహరాశి మూవీ నా ఫేవరేట్ ఫిలిం. దామోదరప్రసాద్ గారికి, సముద్ర గారికి థ్యాంక్స్. ఇక్కడికి రాగానే ఏదో బిజినెస్ అవుతుందని అనుకోవద్దు. మేము చాలా జాగ్రత్తగా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల టేస్ట్ కు తగినట్లు మూవీ చేశాం. చాలా మంచి కాస్టింగ్ మా మూవీలో ఉంది. వాళ్లంతా డైరెక్టర్ గా నేను ఎలా చెబితే అలా పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. జూలై 24న రిలీజ్ అవుతున్న మా సినిమాను కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. అన్నారు.
హీరోయిన్ సోనాలీ మాట్లాడుతూ – మా చంద్రప్పన్ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఏ జర్నీ అయినా తొలి అడుగుతోనే మొదలువుతుంది. మా మూవీ మీ దగ్గరకు చేరే క్రమంలో వేసిన మొదటి అడుగు ఈ ట్రైలర్. ఈ సినిమా చేస్తున్నుపుడు మాలో ఎక్కువగా నమ్మకం లేదు. కానీ డైరెక్టర్ యష్మన్ గారు మొదటి నుంచి ఈ స్కిప్ట్ ను నమ్మారు. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే మా అందరిలో ఆ నమ్మకం పెరుగుతోంది. కొన్ని నెలల పాటు యూనిట్ అంతా పడిన కష్టం ఈ సినిమా. మా కష్టానికి జూలై 24న మంచి ఫలితం మీరు అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.