
ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తర జర్మనీలోని స్టాడే పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు.
ఈ ఘటనలో షూటర్‌గా అనుమానిస్తున్న వ్యక్తితో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాంబర్గ్‌కు పశ్చిమాన ఉండే ఈ స్టాడే పట్టణంలోని యువజన సంక్షేమ కేంద్రం సమీపంలో కాల్పులు జరిగాయి. మృతుల వివరాలను ప్రకటించినప్పటికీ.. గాయపడిన వారి సంఖ్య పేర్కొనలేదు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు స్టాడే పట్టణ కేంద్రానికి వెలుపల భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.