
అమరావతి: విద్యార్థి కోణం నుంచే విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు రికమండేషన్ అడిగే రోజులు వచ్చాయని చెప్పారు. 55 మంది షైనింగ్ స్టార్లకు రూ.
30 వేలు చొప్పున నగదు ప్రోత్సాహం, 61 మంది ఇంటర్ షైనింగ్ స్టార్లకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షైనింగ్ స్టార్లే తమ బ్రాండ్ అంబాసిడర్లని వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో రాజకీయాలు ఉండకూడదన్నారు. దేశం మొత్తం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.