ఉదయం పూట త్వరగా నిద్రలేవండి. దీని వల్ల అన్ని పనులు చేసేందుకు సమయం లభిస్తుంది. దీంతో ఒత్తిడి మొత్తం మాయం అవుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగండి. దీని వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది.
బాడీ చురుకుగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
ఉదయం నిద్రలేచిన తర్వాత కాసేపు పచ్చని ప్రకృతిలో సమయం గడపండి. దీని వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
ఉదయం నిద్రలేచిన తర్వాత ఎండలో కాసేపు ఉండండి. దీని వల్ల విటమిన్ డి అందుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి మాయం అవుతుంది.
ఆ రోజు చేయాల్సిన పనులను ఒక చోట రాసుకోండి. దీని వల్ల రోజును సరిగా వినియోగించుకోగలం. ఒత్తిడి మొత్తం మాయం అవుతుంది.
ఉదయం పూట స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయండి. ఇవి కండరాలను రిలాక్స్‌గా ఉంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఉదయం పూట ప్రశాంతమైన మ్యూజిక్ వినండి. మంచి పాటలు వినడం వల్ల ఉత్సాహం వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది.
ఉదయం పూట చల్లని నీటితో స్నానం చేయండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి మొత్తం మాయం అవుతుంది.
ఉదయం నిద్రలేచిన తర్వాత కాసేపు ధ్యానం చేయండి. దీని వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆలోచనల పరంపర తగ్గుతుంది. ఒత్తిడి మాయం అవుతుంది.