
విజయవాడ: గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పీఎస్‌లో హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు. ఈ కేసులో ప్రధాన నింది
తుడిగా ఉన్న సీఐ నాగరాజుకు వీరిద్దరూ వెన్నంటి ఉండేవారు. సాయికృష్ణ మృతి వ్యవహారంలో అశోక్, నాని ఆయనకు సహకారం అందించినట్లు సిట్ గుర్తించింది. నాగరాజు అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వారిద్దరూ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.