
ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల ఆరుతడి పంటలు వేసి అధికంగా దిగుబడులు సాధించాలని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్లలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. స్వయంగా నాగలితో దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. ఏరువాక పున్నమిరోజు రాష్ట్రంలో వ్యవసాయం ప్రారంభ దినమని మంత్రి తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడి, పాడిపంటలు పండి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. దేశానికే వెన్నెముక అయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు. ఈ వార్త చదివారా: కామారెడ్డిలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 131వ శాఖ ప్రారంభం