సోషల్ మీడియాలో సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక యూట్యూబ్‌లో అయితే సుధీర్ ఫ్యాన్స్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.
షోలు, వాటికి సంబంధించిన ప్రోమోల కింద కామెంట్లు చూస్తే అంతా సుధీర్ ఫ్యాన్సే కనిపిస్తుంటారు. ఇక సుధీర్ ఎవరైనా ఏదైనా కామెడీగా కౌంటర్లు వేస్తే అవతలి వారిని ట్రోలింగ్ చేసి పడేస్తారు. ఇక ఈ మధ్య డ్రామా జూనియర్స్ షోలో సుధీర్ మీద చిన్న పిల్లలు ఎక్కువగా కౌంటర్లు వేస్తున్నారని, వారితో అలాంటి పంచ్‌లు మాన్పించాలని సుధీర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే డ్రామా జూనియర్స్ టీం మాత్రం అవన్నీ లైట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.ఫ్యాన్స్ అలా హర్ట్ అవుతుంటారు కానీ సుధీర్ మాత్రం వీటన్నంటిని ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకుంటాడన్న సంగతి తెలిసిందే. షో కోసం, కామెడీ కోసం, ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసేందుకు పది మందితో తన మీద సెటైర్లు వేయించుకోవడానికి రెడీ అని సుధీర్ ఎప్పుడో చెప్పాడు. ప్రేక్షకుల్ని నవ్వించడమే తమ లక్ష్యమని, దాని కోసం ఏమైనా చేస్తానని సుధీర్ అంటుంటాడు. ఇక డ్రామా జూనియర్స్ షోలో పిల్లలు కాస్త హద్దులు దాటుతూ సుధీర్ మీద కౌంటర్లు వేస్తుంటారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ పిల్లలు కౌంటర్లు వేశారు.ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో పిల్లలు ఓ స్కిట్ చేశారు. మన ఫ్యాక్షన్ సినిమాల్ని స్పూప్‌గా తీశారు. అందులో ఆది సీన్‌ను రీ క్రియేట్ చేశారు. ఏం తేజస్సు బిడ్డా అని ఉండే ఐకానిక్ సీన్‌ను వాడుకున్నారు. అందులో సుధీర్ ఎంట్రీ ఇవ్వగానే.. ఏం తేజస్సు బిడ్డా.. సింగరేణి బొగ్గు గురించి వినడమే కానీ.. ఇప్పుడే చూస్తున్నా.. అని ఓ పిల్లాడు కౌంటర్లు వేస్తాడు. దీంతో అందరూ నవ్వేస్తారు. ఏది ఒకసారి తొడ కొట్టు అని అక్కడ కూడా సుధీర్‌ను తక్కువ చేశారు. మిగతా వాళ్లు తొడలు కొడితే.. గ్రాఫిక్స్‌లో ఏవేవో ఎగిరినట్టు చూపిస్తారు. కానీ సుధీర్ కొడితే మాత్రం కామెడీ మ్యూజిక్ వేసేస్తారు. దీంతో రోజా కూడా ఛీ ఛీ అని అంటుంది.మీరు అన్ని సార్లు చీ ఛీ అనకండి.. నాకే ఏదోలా ఉందని సుధీర్ పంచ్ వేస్తాడు. ఇక చివరగా అనిల్ రావిపూడి తొడ కొడితే సముద్రంలోని షిప్ పేలినట్టుగా చూపిస్తారు. రోజా జబ్బ చరిస్తే రోడ్డు రోలర్ పేలి పోతుంది. ఇలా మొత్తానికి అందరూ కలిసి కామెడీ జనరేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఇలా సుధీర్ మీద పంచ్‌లు వేస్తుంటే ఫ్యాన్స్ ఏమో హర్ట్ అవుతున్నారు. కానీ సుధీర్ మాత్రం ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఎలాంటివైనా భరిస్తానని గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే.